ఎఫ్3లో కీలక పాత్రలో కనిపించనున్న సంగీత

రెండేళ్ళ క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించి ప్రేక్షకులకి వినోదాన్ని అందించారు.

 Sangeetha Play Interesting Role In F3 Movie, Tollywood, Venkatesh, Varun Tej, Ta-TeluguStop.com

ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఎఫ్3 మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో మరింత ఫన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసే లోపే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వచ్చేయడంతో వాయిదా పడింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి భాగంలో ఉన్న అందరూ కంటిన్యూ అవుతారు.వారితో పాటు అదనంగా కొత్త పాత్రలని ఈ కథకి అనిల్ జోడించాడు.

ఇందులో భాగంగా సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని తెలుస్తుంది.అలాగే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన సంగీతని ఎఫ్3లో కీలక పాత్ర కోసం అనిల్ ఎంపిక చేసాడని తెలుస్తుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక తల్లి పాత్రలో సంగీత నటించింది.సినిమాలో కనిపిస్తున్నంత సేపు ఆ పాత్రతో నవ్వులు పూయించింది.మంచి టైమింగ్ తో కామెడీ జెనరేట్ చేసి అందరిని మెప్పించింది.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ నేపధ్యంలోనే ఎఫ్3 మూవీ కోసం అనిల్ మరోసారి సంగీతని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండటంతో పాటు పూర్తి వినోదాత్మకంగా కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube