ఫాంటసీ కథని ట్రై చేస్తున్న జార్జ్ రెడ్డి హీరో

వంగవీటి, జార్జ్ రెడ్డి సినిమాలతో హీరోగా ప్రేక్షకులకి చేరువ అయిన యువ హీరో సందీప్ అలియాస్ శాండీ.జ్యోతిలక్ష్మి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర నటుడు తరువాత ఆర్జీవీ వలన హీరోగా మారిపోయాడు.

 Sandy Started News Movie Name As Gandharva, Tollywood, Telugu Cinema, Jorge Redd-TeluguStop.com

ఇక జార్జ్ రెడ్డి సినిమా అతన్ని హీరోగా ఒక రేంజ్ లో నిలబెట్టింది.ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకొని తాజాగా తన కొత్త సినిమా ప్రారంభించారు.

అయితే ఈ సారి మొదటి, రెండు చిత్రాలకి భిన్నమైన కథాంశంతో సినిమా చేస్తున్నాడు.ఇప్పటి వరకు తెలుగులో ఒక ప్రతినాయకుడు నిత్య యవ్వనం ఉండాలని కోరుకొని భంగపడి సినిమాలు తెరపై చూసాం.

కానీ ఈ సినిమాలో హీరోనే నిత్య యవ్వనం కావాలని కోరుకుంటాడు.అలాంటి కథాంశంతో గాంధర్వ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో సందీప్‌మాధవ్‌ కి జోడీగా గాయత్రి ఆర్‌ సురేష్‌, అక్షత శ్రీనివాస్‌ నటిస్తున్నారు.

Telugu Gandharva, Jorge Reddy, Sandeep Madhav, Sandy, Telugu, Tollywood, Vv Vina

అప్సర్ ఈ సినిమాతో‌ దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.దర్శకుడు వీరశంకర్‌ స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు.ఎం.ఎన్‌ మధు నిర్మిస్తున్నారు.హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నివ్వగా, హీరో శ్రీకాంత్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ రెగ్యులర్‌ కమర్షియల్‌ పంథాకు భిన్నంగా సరికొత్త కోణంలో ఈ సినిమా ఉండబోతుందని తెలిపాడు.ఆర్మీ నేపథ్యానికి ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ చేసి సినిమాని తెరకెక్కిస్తున్నట్లు నిత్య యవ్వనుడిలా ఉండాలని కలలు కనే ఓ యువకుడిగా ఈ సినిమాలో తాను కనిపిస్తానని తెలిపారు.ఈ నెల 28 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తామని సాయికుమార్‌, సురేష్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తారని నిర్మాత తెలిపారు.

మరి స్టోరీ సెలక్షన్ పంథా మార్చి సినిమా చేస్తున్న సందీప్ కి ఈ సినిమా ఎలాంటి రిజక్ట్ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube