విజయ్ మాల్యా, నీరవ్ మోడీని మించిపోయిన మరో భారీ కుంభకోణం

దేశంలో ఆర్ధిక నేరగాళ్ళుగా ముద్ర పడి వేల కోట్ల కుంభకోణాలకి పాల్పడి దేశం విడిచి పారిపోయి పరాయి దేశంలో దర్జాగా తిరుగుతున్న దొంగలు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు వారిని మించిపోయేలా సందేసరా బ్రదర్స్‌ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ సంచలన వాస్తవాలను బయటపెట్టారు.

 Sandesara Brothers Availed Rs 9000 Crore Loan From Indian Banks1-TeluguStop.com

గుజరాత్‌ కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లుగా నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా బ్యాంకులను దాదాపుగా 14,000 కోట్లకి పైగా టోపీ పెట్టారని ఈడీ పేర్కొంది.

నీరవ్‌ మోడి కుంభకోణం 12 వేల కోట్ల రూపాయిలు కాగా సందేసరా సోదరులు దాన్ని మించిపోయేలా బ్యాంకులకు టోకరా పెట్టినట్లు తెలుస్తుంది.

భారత్‌ లో పలు బ్యాంకుల నుంచి 5393 కోట్లు రుణాలు తీసుకుని ఈ అన్నదమ్ములు ఎగవేతకు పాల్పడిన ఈ ఇద్దరు విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకుల నుంచి 9 వేల కోట్లు రుణాల రూపంలో తీసుకున్నట్టు ఈడీ దర్యాప్తులో తేల్చింది.వీరిపై 2017 లోనే ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసాయి.

వీరి కేసుపై దర్యాప్తును అనుసరించి ఇప్పటి వరకు సందేసరా కుటుంబీకులకు చెందిన 9778 కోట్ల ఆస్తులను జప్తు చేసారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube