అమెరికా ఎన్నికలు దూసుకుపోతున్న శాండర్స్

అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే, ఈసారి ఎలాగైనా నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డెమోక్రటిక్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

 Sanders Raises Staggering 46 Million Dollars In February-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇదిలా ఉంటే

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న సెనేటర్ శాండర్స్ కు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని ప్రకటిస్తోంది స్థానిక మీడియా.ఒక్క ఫిబ్రవరి నెలలోనే శాండర్స్ కి 4.65 కోట్ల డాలర్లు విరాళాలుగా వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని శాండర్స్ ప్రచార నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.ప్రైమరీ ఎన్నికల ముందు నిర్వహించే భారీ సదస్సులో అధ్యక్ష కోసం పోటీపడే అభ్యర్థులు ప్రసంగించిన అనంతరం పార్టీ శ్రేణులు, కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తాయి

Telugu Dollars, Bernie Sanders, Democratic, February, Presidential-

ఈ విరాళాలు ఎంత ఎక్కువ వస్తే పార్టీలో అంతగా పలుకుబడి ఉన్నట్లుగా భావిస్తారు.శాండర్స్ తోపాటు రేసులో ఉన్న మరో సోషలిస్టు వారన్ కి 2.9 కోట్ల డాలర్లు, అలాగే మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ కి 1.9 కోట్ల డాలర్లు విరాళాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.మరి చివరి రేసులో ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ కి చేరుకుంటారోననే ఉత్కంట ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ నేతలలో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube