చిరంజీవి నుండి అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ ఆశిస్తున్నది చూస్తే నవ్వొస్తుంది

మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.ఆయనతో ఒక్క సినిమా అయినా చేసి టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ జాబితాలో చేరిపోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు.

 Sandeep Vanga Want To Direct Megastar Chiranjeevi-TeluguStop.com

చిరంజీవి వంటి మెగాస్టార్‌ తో తనకు ఒక సినిమా చేయాలని ఉందని అర్జున్‌ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ అన్నాడు.ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌ లో తన మూడవ సినిమాను చేస్తున్నాడు.

త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది.

Telugu Sandeep Vanga, Sandeepvanga-

  ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో ఒక చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడట.ఇదే సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా అనేది నా కోరిక.ఆయన కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ రెడీ చేసి ఉంచాను.

ఆయన వయసుకు తగ్గట్లుగా నేను కథను సిద్దం చేసుకుని పెట్టుకున్నాను.ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు చేసేందుకు రెడీగా ఉన్నాను అన్నాడు.

అయితే చిరంజీవి ప్రస్తుతం వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.కనుక సందీప్‌ రెడ్డితో సినిమా అంటే ఇప్పట్లో కష్టమే.

Telugu Sandeep Vanga, Sandeepvanga-

  ఆయనతో సినిమా చేయకున్నా కూడా ఒక్కసారి చిరంజీవి గారికి కథ చెప్పే అవకాశం వచ్చినా చాలు అని సందీప్‌ రెడ్డి వంగ ఆశిస్తున్నాడట.చిరంజీవి గారు నా సినిమాను చేయకున్నా పర్వాలేదు కాని నా కథను ఒకసారి వింటే చాలని, అదే నాకు పెద్ద అచీవ్‌మెంట్‌ అంటూ సందీప్‌ రెడ్డి వింతగా కోరిక కోరుతున్నాడు.ఎవరైనా సినిమా చేయాలని అనుకుంటారు.కాని చిరంజీవి నుండి సందీప్‌ ఆశిస్తున్నది మాత్రం కాస్త విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube