మళ్లీ అర్జున్‌ రెడ్డి హంగామా సృష్టిస్తారట

తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమా ‘అర్జున్‌ రెడ్డి’.విజయ్‌ దేవరకొండ, సందీప్‌ వంగల కాంబినేషన్‌లో వచ్చిన అర్జున్‌ రెడ్డి కలెక్షన్స్‌ విషయంలో కూడా సూపర్‌ హిట్‌ అనిపించుకుంది.

 Sandeep Vanga Next Film With Vijay Devarakonda-TeluguStop.com

హిందీలో ఈ చిత్రం రీమేక్‌ చేయగా అక్కడ సెన్షేషనల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.రికార్డు స్థాయిలో సక్సెస్‌ అయిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ను ఒరిజినల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగ హిందీలో తెరకెక్కించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం సందీప్‌ వంగాకు మంచి ఫాలోయింగ్‌ ఉంది.

Telugu Kabir Singh, Sandeepgive, Sandeep Vanga, Sandeepvanga-

  అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ తర్వాత హిందీలోనే ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా సందీప్‌ వంగ ప్రకటించాడు.ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.ఈ సమయంలోనే ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్‌ వంగ తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చాడు.

హిందీలో చేయబోతున్న సినిమా తర్వాత తాను తెలుగులో సినిమా చేయబోతున్నాను.ఆ సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండ నటించబోతున్నట్లుగా ప్రకటించాడు.

Telugu Kabir Singh, Sandeepgive, Sandeep Vanga, Sandeepvanga-

  విజయ్‌ దేవరకొండ కోసం అర్జున్‌ రెడ్డి సమయంలోనే స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.త్వరలోనే ఆ స్క్రిప్ట్‌ పూర్తి వివరాలను వెళ్లడిస్తానంటూ ప్రకటించాడు.ప్రస్తుతం హిందీ సినిమా విషయంలో బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి మూవీకి సిద్దం అయ్యాడు.ఆ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube