పాపం యంగ్ హీరో చాలా కష్టపడ్డాడు.. ఆ విషయంలో అజాగ్రత్త కొంప ముంచింది

యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాల కోసం చాలా కష్టపడుతున్నాడు.కెరియర్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆ తర్వాత పలు విభిన్నమైన కథ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Sandeep Kishan Michael Movie Result , Michael Movie,sandeep ,sandeep Kishan , V-TeluguStop.com

సందీప్ కిషన్ ప్రయోగాత్మకంగా చేస్తున్న సినిమాల్లో చాలా వరకు నిరాశ పరుచుతున్నాయి.పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆయన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినా కూడా తిరస్కరణకు గురయ్యాయి.

తాజాగా గ్యాంగ్ స్టార్ నేపథ్యం లో మైఖేల్ అనే సినిమా ను సందీప్ కిషన్ చేశాడు.ఆ సినిమా కు సంబంధించి అంచనాలు భారీగా నమోదయ్యాయి.

విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి స్టార్స్ నటించడం తో అంచనాలు భారీగా పెరిగాయి.

Telugu Michael, Sandeep, Sandeep Kishan-Movie

పైగా సినిమా కోసం సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ ని ట్రై చేయడం తో పాటు యాక్షన్స్ సన్నివేశాల కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు.అయినా కూడా మైఖేల్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.తెలుగు లోనే కాకుండా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేయడం జరిగింది.

కానీ ఎక్కడ కూడా సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోయింది.సినిమా కోసం చాలా కష్టపడ్డ సందీప్ కిషన్ కచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం తో ఉన్నాడు.

ఆయన నమ్మకం నిలబడలేదు.

Telugu Michael, Sandeep, Sandeep Kishan-Movie

ప్రేక్షకులు ఈ సినిమా పై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.మైఖేల్ సినిమా సందీప్ కిషన్ యొక్క గత సినిమాల మాదిరిగానే రొటీన్ గా ఉండి ఆకట్టుకోలేక పోయాయి.సక్సెస్ కోసం మరో సినిమా వరకు సందీప్ కిషన్ వెయిట్ చేయాల్సి వచ్చింది.

వరుసగా ఫ్లాప్ అవుతున్న సందీప్ కెరీర్ సందిగ్దంలో పడ్డట్లు అవుతుంది.ముందు ముందు అయినా సక్సెస్ లను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube