పోటీ లేకుండానే బరిలోకి దిగుతున్న సందీప్‌.. ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌ ఖాయమా?

సందీప్‌ కిషన్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా హాకీ నేపథ్యంలో రూపొందిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ఈ వారం అంటే 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.గత కొన్ని వారాలుగా వరుసగా చిన్నా చితకా పెద్ద సినిమా లు బాక్సాపీస్‌ ముందుకు వస్తున్నాయి.

 Sandeep Kishan And Lavany Tripathi Movie A1 Express Movie Release This Week-TeluguStop.com

ఆ సినిమాల విషయానికి వస్తే కొన్ని నిరాశ పర్చుతుంటే కొన్ని మాత్రం బాగున్నాయి అంటూ టాక్ ను దక్కించుకున్నాయి.ఇలాంటి సమయంలో సందీప్‌ కిషన్‌ నటించిన ఈ సినిమా కు పెద్దగా పోటీ లేకుండా సోలో రిలీజ్ గానే విడుదలకు సిద్దం అయ్యింది.ఈ 5వ తారీకు న లెక్కకు మొత్తం 7 సినిమా లు వస్తున్నా కూడా అందులో సందీప్‌ కిషన్‌ నటిస్తున్న సినిమా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది.

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా గురించి అంచనాలు పాజిటివ్ గా ఉన్నాయి.సినిమా లో లావణ్య త్రిపాఠి మరియు సందీప్‌ కిషన్ ల రొమాన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మొదటి హాకీ మూవీ అంటూ టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

 Sandeep Kishan And Lavany Tripathi Movie A1 Express Movie Release This Week-పోటీ లేకుండానే బరిలోకి దిగుతున్న సందీప్‌.. ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌ ఖాయమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు ప్రేక్షకులు హాకీ నేపథ్యం అవ్వడంతో ఖచ్చితంగా ఆకర్షితులు అవుతున్నారు.పెద్ద ఎత్తున సినిమా లో హాకీ సీన్స్ ఉంటాయి కనుక సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అయ్యి హాకీ కోసం అయినా ప్రేక్షకులు చూసేందుకు వస్తారని అంటున్నారు.

ఇక ఏడు సినిమా ల్లో రాజ్ తరుణ్‌ నటించిన పవర్‌ ప్లే సినిమా కాస్త ఆసక్తిగా అనిపించినా కూడా ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ తర్వాతే ఆ సినిమా అన్నట్లుగా ఉంది.కనుక ఖచ్చితంగా ఈ వారం రాబోతున్న ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ కు పోటీ ఉండక పోవచ్చు అంటున్నారు.

గత వారాల్లో విడుదల అయిన సినిమా లజోరు తగ్గింది కనుక ఈ సినిమా దుమ్ము రేపే అవకాశం ఉందంటున్నారు.

#A1 Express #Sandeep Kishan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు