20లో 14 సినిమాలకు పారితోషికం తీసుకోలేదట  

Sandeep Kisan About His Remunaration For His 20 Moies-

టాలీవుడ్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కష్టమైన విషయమే.అయినా కూడా చాలా మంది నటులు అవ్వడానికి ఇండస్ట్రీకి వస్తారు.అయితే వారిని కొందరు నిర్మాతలు సంప్రదించి తమ వద్ద కాస్త తక్కువ డబ్బు ఉంది...

Sandeep Kisan About His Remunaration For His 20 Moies--Sandeep Kisan About His Remunaration For 20 Moies-

అది సర్దితే నీవే హీరో అంటూ చెబుతూ ఉంటారు.అలా ఎక్కువ శాతం మంది కొత్త హీరోలు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటారు.ఆ సినిమాలు సక్సెస్‌ అయితే పర్వాలేదు.

లేదంటే డబ్బు పోయే, క్రేజ్‌ రాకపోయే అన్నట్లుగా ఉంటుంది.యంగ్‌ హీరోలకు ఆఫర్లు రావడమే ఎక్కువ, అలాంటిది ఇక వారి పారితోషికం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

Sandeep Kisan About His Remunaration For His 20 Moies--Sandeep Kisan About His Remunaration For 20 Moies-

తాజాగా ఈ విషయాన్ని స్వయంగా సందీప్‌ కిషన్‌ చెప్పుకొచ్చాడు.ఇప్పటి వరకు తాను 20 సినిమాల్లో నటించాను.కాని అందులో 14 సినిమాలకు పారితోషికం తీసుకోకుండానే నటించాను.కథ నచ్చడంతో సినిమాకు కమిట్‌ అవ్వడం, నిర్మాత ఆర్థిక పరిస్థితులను చూసి జాలి పడి సక్సెస్‌ అయితే ఆ తర్వాత తీసుకుందాం అనుకోవడం చేసేవాడట.

దాంతో ఈయన చాలా సినిమాలకు అసలు రెమ్యూనరేషన్‌ లేకుండానే అంటే జీరో పారితోషికంతో వర్క్‌ చేయాల్సి వచ్చిందట...

14 సినిమాల్లో కొన్ని మంచి వసూళ్లను రాబట్టినా కూడా నిర్మాతలు అటు ఇటు అంటూ లెక్కలు చెప్పి వారు కూడా నాకు పారితోషికం ఇవ్వలేదని, నాకు సినిమాలపై ఉన్న ఆసక్తితోనే నేను పారితోషికం లేకున్నా సినిమాలు చేస్తున్నాను అన్నాడు.తాజాగా ఈయన నిను వీడని నీడను నేనే అనే హర్రర్‌ చిత్రంలో నటించాడు.రెండేళ్లుగా ఆఫర్లు లేకపోవడంతో స్వయంగా నిర్మాతగా ఈయనే రంగంలోకి దిగాడు.

మరి ఈ చిత్రంతో అయినా సందీప్‌ కిషన్‌కు డబ్బులు వస్తాయో చూడాలి.