Harshika Poonacha Bhuvan Ponnanna: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో సెలబ్రిటీ జంట.. ఎవరో తెలుసా?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతూ మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు.

కొంతమంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటుండగా మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటున్నారు.ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.

రక్షిత రెడ్డి అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

అలాగే బుల్లితెర జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.టాలీవుడ్ చిరు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు మూడుముళ్ల బంధంతో ఒకటి అవుతున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే త్వరలోనే మరొక జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.మరి ఆ జంట ఎవరు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయాల్లోకి వెళితే.శాండల్‌వుడ్‌ జంట పక్షులు హర్షికా పూనంచ,( Harshika Poonacha ) భువన్ పొన్నన్నలు( Bhuvan Ponnanna ) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఆగస్టు 24న వీరి పెళ్లి జరగనుంది.అందుకు సంబంధించిన వివాహ పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వారి ఈ శుభలేఖను కొడవ( Kodava ) అనే భాషలో ముద్రించారు.

విరాజ్‌పేటలోని అమ్మట్టిలో వీరి వివాహం జరగనుంది.హర్షిక పూనంచ, భువన్ పొన్నన్న చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు.

అయితే వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై ఈ నటీనటులు స్పందించలేదు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇప్పుడు పెళ్లికి సంబంధించిన లగ్న పత్రిక బయటకు వచ్చేసరికి వీరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది.కాగా కొడవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది.

Advertisement

ఈ కార్యక్రమంలో సినీ రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొననున్నారు.

తాజా వార్తలు