వేస‌విలో చ‌ర్మాన్ని ర‌క్షించే గంధం..ఎలా వాడాలంటే?

వేస‌వి కాలంలో రానే వ‌చ్చింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది ఎండ‌లు మండిపోతున్నాయి.

 Sandalwood To Protect Skin In Summer How To Use-TeluguStop.com

ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జలు బ‌య‌ట కాలు పెట్టేందుకే బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

అందుకే ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని కూడా ఎంతో జాగ్ర‌త్త‌గా ర‌క్షించుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే వేస‌వి కాలంలో ఎలాంటి స‌మస్య‌ల‌నైనా దూరం చేసి చ‌ర్మాన్ని రక్షించ‌డంలో గంధం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

 Sandalwood To Protect Skin In Summer How To Use-వేస‌విలో చ‌ర్మాన్ని ర‌క్షించే గంధం..ఎలా వాడాలంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి గంధాన్ని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు చూసేయండి.

సాధార‌ణంగా వేస‌విలో త‌ర‌చూ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో స‌న్ ట్యాన్ ఒక‌టి.

కాసేపు ఎండ‌లో తిరిగితే చాలు చ‌ర్మం ట్యాన్ అయిపోతుంది.అయితే అలాంటిప్పుడు గంధం పొడి, గులాబీ రేక‌ల పొడి మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేసి డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

చ‌ర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే స‌మ్మ‌ర్‌లో అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా చ‌ర్మం పేలిపోయి మంట ప‌డుతూ ఉంటుంది.అలాంట‌ప్పుడు గంధం పొడి, కొబ్బ‌రి నీరు వేసి బాగా క‌లిపి చ‌ర్మానికి అప్లై చేయాలి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నిచ్చి ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే చ‌ర్మం మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది.

Telugu Beauty, Beauty Tips, Benefits Of Sandalwood Powder, Face Packs, Latest News, Sandalwood Powder, Sandalwood Powder For Skin, Skin Care, Summer, Summer Tips-Latest News - Telugu

ఇక ఎండ‌ల కార‌ణంగా చ‌ర్మ కాంతి త‌గ్గుతూ ఉంటుంది.అయితే గంధం పొడి, తేనె మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మానికి ముఖానికి పూత‌లా వేసుకుని.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే చ‌ర్మం మృదువుగా, య‌వ్వ‌నంగా మ‌రియు ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

#Face Packs #BenefitsOf #Beauty Tips #Summer #Skin Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు