మొటిమల మచ్చలు మాయం కావాలంటే...  

Sandalwood Remedies For Skin-

చర్మం మీద మొటిమలు,మచ్చలు, చర్మం నిర్జీవంగా మారటం, చర్మం ఎరుపు రంగులోకి మారటం మరియు నల్లగా మారటం వంటి అనేక సమస్యలకు గందం మంచి పరిష్కారాన్ని చూపుతుంది.ఇప్పుడు గందం ఉపయోగించి కొన్ని ప్యాక్ లను తయారుచేసుకుందాం.ఒక బౌల్ లో రెండు స్పూన్ల గందం, ఒక స్పూన్ పసుపు, మూడు స్పూన్ల తేనే వేసి బాగా కలపాలి.

Sandalwood Remedies For Skin---

ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఒక బౌల్ లో ఒక స్పూన్ నారింజ తొక్కల పొడి,రెండు స్పూన్ల గందం,మూడు స్పూన్ల రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఒక బౌల్ లో ఒక స్పూన్ గందం, ఒక స్పూన్ ముల్టానా మట్టి, రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ గందం, నీరు కలిపి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి ప్యాక్ లా వేయాలి.ఈ ప్యాక్ ముఖానికి కాంతిని ఇస్తుంది.