ఏది కావాల‌న్నా వెంట‌నే సాంక్ష‌న్ చేస్తున్నారు.. హుజూరాబాద్ ఊర్ల‌ను చుట్టేస్తున్న మంత్రులు

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి.అక్క‌డ గెలిచేందుకు ఈట‌ల రాజేంద‌ర్, టీఆర్ ఎస్ మంత్రులు జోరుమీద రాజ‌కీయాలు చేస్తున్నారు.

 Sanctions Are Being Carried Out Immediately Ministers Are Circling The Huzurabad Settlements-TeluguStop.com

ఇక ఈ ఉప ఎన్నిక‌ను టీఆర్ ఎస్ అధిష్టానం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.ఎలాగైనా గెలిచి పార్టీ ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తోంది.

ఈట‌ల లాంటి నాయ‌కులు లేక‌పోయినా త‌మ పార్టీకి తిరుగులేద‌ని కేసీఆర్ నిరూపించుకోవాల‌ని చూస్తున్నారు.

 Sanctions Are Being Carried Out Immediately Ministers Are Circling The Huzurabad Settlements-ఏది కావాల‌న్నా వెంట‌నే సాంక్ష‌న్ చేస్తున్నారు.. హుజూరాబాద్ ఊర్ల‌ను చుట్టేస్తున్న మంత్రులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకోసం కేసీఆర్ మొద‌టి నుంచి హుజూరాబాద్ కోసం ప్ర‌త్యేక‌మైన వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు.

స్వ‌యంగా ఆయ‌నే ద‌గ్గ‌రుండి మానిట‌రింగ్ చేస్తున్నారు.ఇందులో మ‌రీ ముఖ్యంగా ఈట‌ల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న హ‌రీశ్‌రావు లాంటి ట్ర‌బుల్ షూట‌ర్ భుజాల‌పై బాధ్య‌త పెట్టారు కేసీఆర్‌.

ఇందుకు సంబంధించిన ప‌నులను ఇప్ప‌టికే వేగవంతం చేస్తున్నారు.

హ‌రీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోని రాజ‌కీయాల్లో జోరుగా ప‌నిచేస్తున్నారు.

మండ‌లాలు, కులాలు, సంఘాలు, వ‌ర్గాల వారీగా మీటింగులు పెడుతూ వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు.

Telugu @cm_kcr, @ktrtrs, Bjp, Etela Vs Kcr, Huzurabad Constituency, Huzurabad Elections, Huzurabad Politics, Ktr, Sanctioning Roads Buildings, Telangana Politics, Trs-Telugu Political News

మంత్రి హ‌రీశ్ రావు వీట‌న్నింటికీ ఇన్‌చార్జిగా ఉంటూ ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు చ‌క్రం తిప్పుతున్నారు.ఇక హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు ఏది కావాల‌న్నా వెంట‌నే ఇస్తున్నారు టీఆర్ ఎస్ నాయ‌కులు.పిఛ‌న్ నుంచి కొత్త రేష‌న్‌కార్డు కావాల వ‌ర‌కు రాష్ట్రంలో ఇవ్వ‌కున్నా.

హుజూరాబాద్‌లో మాత్రం ఇస్తున్నారు.

రోడ్లు కావాల‌న్నా వెంట వెంట‌నే టెండ‌ర్లు పిలిచి సాంక్ష‌న్ చేయిస్తూ ప‌ట్టు నిలుపుకుంటున్నారు.

Telugu @cm_kcr, @ktrtrs, Bjp, Etela Vs Kcr, Huzurabad Constituency, Huzurabad Elections, Huzurabad Politics, Ktr, Sanctioning Roads Buildings, Telangana Politics, Trs-Telugu Political News

ప్ర‌త్యేక నిధులు తీసుకొచ్చి మ‌రీ స్పెష‌ల్ కేట‌గిరీ కింద అభివృద్ధి ప‌నులు చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.మ‌రి అభ్య‌ర్థి ఎవ‌రో తెలియ‌దు గానీ టీఆర్ ఎస్ మాత్రం ప‌క్కాగా పావులు క‌దుపుతోంది.మ‌రి వీటిని ఈట‌ల ఎలా ఎదుర్కొంటార‌నేది ఇక్క‌డ పెద్ద ప్ర‌శ్న‌.ఇప్ప‌టికే ఆయ‌న కూడా ఊర్ల‌ల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ త‌న మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నారు.చూడాలి మ‌రి ఎవ‌రు గెలుస్తారో త్వ‌ర‌లో వ‌చ్చే ఉప ఎన్నిక‌లో.

#@KTRTRS #Etela Vs Kcr #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు