ఫ్యాన్స్ ను సాయం కోసం వేడుకుంటున్న హీరోయిన్.. ఏమైందంటే..?

చైనా దేశం నుంచి మన దేశానికి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

 Samyukta Hegde Request Save Her Parents To Fans-TeluguStop.com

తాజాగా కన్నడలో హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న సంయుక్త హెగ్డే తల్లిదండ్రులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది.సంయుక్త తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

సంయుక్త హెగ్డే తండ్రి ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.అయితే సంయుక్త హెగ్డే తండ్రి చికిత్స కొరకు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అవసరం కాగా ఆ ఇంజక్షన్ల కొరకు ఆమె చాలామందిని సంప్రదించి ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు.

 Samyukta Hegde Request Save Her Parents To Fans-ఫ్యాన్స్ ను సాయం కోసం వేడుకుంటున్న హీరోయిన్.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంయుక్త హెగ్డే తండ్రిని ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని సూచనలు చేస్తున్నా ఆయన మాత్రం అందుకు అంగీకరించడం లేదు.

Telugu Corona Second Wave, Kirrak Party, Remdesivir Injections, Request To Fans, Samyukta Hegde, Samyukta Hegde Parents Covid Infected, Save Her Parents, Social Media-Movie

ఎవరైనా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను కలిగి ఉంటే తనకు మెసేజ్ చేయాలని సంయుక్త హెగ్డే అభిమానులను కోరారు.ఆ ఇంజక్షన్ల కోసం తాను కొన్ని నంబర్లకు ట్రై చేశానని కానీ ఆ నంబర్లు స్విఛాఫ్ వస్తున్నాయని ఆమె వెల్లడించారు.తనకు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సహాయం చేసి తన తల్లిదండ్రులను రక్షించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరడం గమనార్హం.

సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే ఇంజక్షన్ల కొరకు ఇంత ఇబ్బంది పడుతుంటే సామాన్యులు కరోనా వల్ల ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో సులభంగానే అర్థమవుతుంది.సంయుక్త హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ అనే సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా కన్నడలో మాత్రం ఈ హీరోయిన్ కు బాగానే ఆఫర్లు వచ్చాయి.

#Samyukta Hegde #Request To Fans #SamyuktaHegde #Kirrak Party #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు