సముద్ర చేతుల మీదుగా సముద్రుడు చిత్రం టీజర్ విడుదల

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్, శ్రీరామోజు జ్ఞానేశ్వర్, సోములు నిర్మించిన చిత్రం ‘సముద్రుడు’.రమాకాంత్, భానుశ్రీ (బిగ్‌బాస్ ఫేం), అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను హీరో రమాకాంత్ జన్మదిన సందర్భంగా ప్రముఖ దర్శకుడు వి.

 Samudrudu Teaser Released By Director V Samudra-TeluguStop.com

సముద్ర మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ… రమాకాంత్ నా సినిమాలన్నింటిలో నటించాడు.నేను అంటే తనకు చాలా అభిమానం.

నా పేరుతో టైటిల్ పెడతాడని అనుకోలేదు.పాజిటివ్ టైటిల్.

భానుశ్రీ నటించిన సినిమాలన్నింటికీ ఓపెనింగ్స్ బాగుంటాయి.ఈ సినిమాకు కూడా అలానే ఉండాలని అనుకుంటున్నా.

దర్శకుడు నగేష్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి.మంచి విజయాన్ని అందుకొని ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.

’’ అన్నారు.
హీరో రమాకాంత్ మాట్లాడుతూ.

‘‘నా కూతురు కీర్తన పేరు మీద ప్రొడక్షన్ మొదలుపెట్టాము.తను నాకు బాగా కలిసొస్తుందనే ఈ సినిమాను చేయడం జరిగింది.

సినిమా విషయానికి వస్తే.చేపలు పట్టే వారి జీవన శైలిపై తీసిన కథాంశం.

ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్.చాలా కష్టపడి పనిచేసాము.

అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.’’ అన్నారు.
హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ.నరసింహాలో రమ్యకృష్ణగారి పాత్రలా ఉంటుంది నా క్యారెక్టర్.స్టోరీ వినగానే ఏం మాట్లాడకుండా ఓకే చెప్పేశా…మంచి పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు నగేష్ గారికి నా కృతఙ్ఞతలు అని అన్నారు.
ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ… టైటిల్, స్టోరీ నచ్చి సినిమా చేశాము.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో… రెండవ షెడ్యూల్ 40 రోజులు చీరాలలో షూటింగ్ చేశాము.మే నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియచేశారు.
దర్శకుడు నగేష్ మాట్లాడుతూ.క్రౌడ్ ఎక్కువగా.

ప్యాడింగ్ ఎక్కువగా ఉన్న సినిమా ఇది.ఒక ఊరిలో చేపలు పట్టే వారి జీవన శైలి కథాంశం.ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.పక్కా కమర్షియల్ చిత్రం సముద్రుడు.అందరికీ నచ్చేలా ఉంటుంది అని చెప్పారు.
బేబీ కీర్తన, నిర్మాత అశోక్, ముత్యాల రామదాసు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శేషు, మరియు ఈ చిత్ర టెక్నేషియన్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రమాకాంత్, భానుశ్రీ (బిగ్‌బాస్ ఫేమ్),అవంతిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్, రామరాజు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్, చిత్రం శ్రీను, శ్రావణ్, జబర్దస్త్ శేషు, రాజ ప్రేమి, తేజ రెడ్డి, దిల్ రమేష్, డానియెల్, మల్లేష్, ప్రభావతి, గణేష్, కిషోర్, సిరిరాజ్ తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా:వాసు, ఫైట్స్: సింధూరం సతీష్, నందు, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, డాన్స్: అనీష్, ఎడిటింగ్: బష్వా పైడిరెడ్డి, నిర్మాతలు: బదావత్ కిషన్, శ్రీరామోజు జ్ఞానేశ్వర్, సోములు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube