భారత్‌లో శామ్‌సంగ్‌ ప్రస్థానానికి పాతికేళ్లు : డిజిటిల్ ఇండియా‌కు ఊతం

అది 90వ దశకం.అప్పుడప్పుడే భారత్‌ ఆర్ధిక సంస్కరణలు పెట్టిన తొలినాళ్లు.

 Samsung@25: How Samsung Is Powering Digital India, Simplified Economic Policy,-TeluguStop.com

సరళీకృత ఆర్ధిక విధానాలతో ప్రపంచీకరణ దిశగా భారతావని అడుగులు వేస్తున్న సమయంలో కొన్ని కొరియన్ కంపెనీలు మన గడ్డపై అడుగు పెట్టాయి. డేవూ, హ్యుందాయ్, శామ్‌సంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ భారత్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేశాయి.

మనదేశంలో ఎలక్ట్రానిక్స్, ఆటో‌మొబైల్ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని ఆ కంపెనీలు ఊహించాయి.

శామ్‌సంగ్ ఇండియాలోకి ప్రవేశించి ఈ నెలలో తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.

ఈ సమయంలో తన ప్రారంభరోజులను గుర్తు తెచ్చుకుంటోంది.ఎన్నో దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఎదుర్కొని ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది.

స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సెస్‌ సరఫరాదారుగా శామ్‌సంగ్ మొదటి స్థానంలో వుంది.

Telugu Automobile, Daewoo, Electronics, Hyundai, Iconic Opera, Korean Company, L

1995లో భారత ఆర్ధిక వ్యవస్థ విలువ 360 బిలియన్ డాలర్లు.1996లో బెంగళూరులో ఆర్ అండ్ డీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావించింది.ఫ్రాన్స్, యూకేలను అధిగమించి ఇప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.

రోక్ డేటా ప్రకారం.శామ్‌సంగ్ టర్నోవర్ 1996లో 6 మిలియన్ డాలర్లు ఉండగా, అది 2019లో 10 బిలియన్‌ డాలర్లకు పెరగడం ఆ సంస్థ సాధించిన ప్రగతికి నిదర్శనం.

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్‌‌లకు భారతీయుల నుంచి మంచి స్పందన వస్తోంది.ప్రస్తుతం ఈ కొరియన్ దిగ్గజానికి భారత్‌లో వున్న మూడు ఆర్‌ అండ్ డీ కేంద్రాలు.

ఐవోటీ, మెషిన్ లెర్నింగ్, కెమెరాలు, క్లౌడ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తున్నాయి.నేడు శామ్‌సంగ్ 2,00,000 రిటైల్ భాగస్వాములతో దేశంలో అతిపెద్ద రిటైల్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కలిగి వుంది.2018లో ప్రారంభించిన బెంగళూరులోని ఐకానిక్ ఒపెరా హౌస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వుంది.

శామ్‌సంగ్ ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించడం ప్రారంభించింది.స్మార్ట్‌ఫోన్ల ప్లేసులో శామ్‌సంగ్ 2020 చివరి నాటికి తన ఆన్‌లైన్ బిజినెస్‌ మార్కెట్ షేర్‌ను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.1996లో నోయిడాలో ప్రారంభించబడిన కర్మాగారం 2007 నాటికి మొబైల్ ఫోన్‌లను తయారు చేయడం స్టార్ట్ చేసింది.2018లో శామ్‌సంగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.ప్రధాని పిలుపునిచ్చిన #PoweringDigitalIndiaకు శామ్‌సంగ్ అండగా నిలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube