చట్టం నా చుట్టం.డబ్బులుంటే ఆ చట్టాన్ని కూడా కొని ఇంటి గుమ్మం ముందు గూర్ఖాలా నిలపెట్ట వచ్చు అని అనుకునే వారికి ఇప్పుడు మనం చదవబోయే ఘటన షాక్ కలిగిస్తుంది.
మనదేశంలో ఎన్ని నేరాలు, అవినీతి పనులు చేసినా చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకోవచ్చు అనుకుంటారు బడా అవినీతి పరులు.కానీ ఆ పరాయి దేశంలో మాత్రం తప్పు చేసిన ఎవరైన శిక్ష అనుభవించక తప్పదని నిరూపించారు.
ఆ దేశం పేరే దక్షణ కొరియా.
ఈ దేశంలో భారీ అవినీతికి పాల్పడిన నేరం రుజువు అయినందుకు శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారైంది.
ఇకపోతే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు అమ్మే సంస్థగా శాంసంగ్‌కు గుర్తింపు ఉన్నది.

ఇంతటి పెద్ద సంస్దలో వైస్ చైర్మన్ హోదాలో ఉన్న లీ జే యాంగ్ లంచాలు, నిధుల దుర్వినియోగం కేసుల్లో చిక్కుకోవడం ఎందరినో ఆశ్చర్యానికి గురిచేస్తుందట.అంతే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీగా పేరుగాంచిన ఈ సంస్ద అక్రమాలకు పాల్పడిన తీరు దురదృష్టకరమని కోర్టు పేర్కొన్నది.
ఇక ఈ ఆరోపణల నేపధ్యంలో మొదటగా లీకి అయిదేళ్ల శిక్ష విధించినా ప్రస్తుతం ఆ శిక్షను రెండున్నరేళ్లకు కుదించారట.
నిజంగా ప్రతి దేశంలో అవినీతికి పాల్పడేవారి స్దాయిని చూడకుండా శిక్షలు అమలు చేస్తే ఈ ప్రపంచంలో ఆకలి చావులనేవి ఉండవు కావచ్చూ అని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారట.