ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఎందుకంటే..!

ఇటీవల ఐఫోన్ తన ఐఫోన్ 12 సిరీస్ ను విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఎప్పటిలాగే ఆపిల్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటాయి.

 Samsung Trolls Iphone For Not Including Charger, Apple Iphone 12, Apple, Samsung-TeluguStop.com

అయితే ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ లకు సంబంధించి కొన్ని విషయాలు చర్చకు దారితీస్తున్నాయి.అందులో ప్రధానమైనది ఐఫోన్ 12 సిరీస్ కు మొబైల్ ఫోన్ కొన్న వారికి కంపెనీ చార్జర్ ఇవ్వకపోవడమే.

ఆపిల్ 12 సిరీస్ ఫోన్ కొనడానికి ఏకంగా 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెడుతున్న కానీ, ఎటువంటి చార్జర్ అందించకపోవడంతో కొంతమంది నెటిజన్స్ ఆపిల్ సంస్థను ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్స్ గురించి చెప్పనక్కర్లేదు.

వేలకు వేలు పోసి మొబైల్ కొన్న కానీ మళ్ళీ చార్జర్ కోసం డబ్బులు చెల్లించాలి అన్న విషయంపై మండిపడుతున్నారు.సపరేట్ గా మళ్లీ చార్జర్ కొనడం ఏంటి అంటూ నెటిజన్లు యాపిల్ సంస్థ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఇందుకు సంబంధించి ఎంతో మంది నెటిజన్స్ ఆపిల్ సంస్థను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.అయితే ఇందుకు సంబంధించి శాంసంగ్ సంస్థ ఆపిల్ సంస్థను దృష్టిలో ఉంచుకొని ఓ ఆసక్తికరమైన పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

” మీ గెలాక్సీ మీరు ఏం కోరుకుంటున్నారో.అది అందిస్తుంది.బెస్ట్ కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్, అలాగే చార్జర్ ” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.ఇందులో భాగంగానే నలుపు రంగు ఉన్న చార్జర్ ఫోటోను పోస్ట్ చేసి తాము ఖచ్చితంగా చార్జర్ ఇస్తామని తెలియజేసింది.

ఆపిల్ సంస్థ ను దృష్టిలో ఉంచుకొని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పది వేలకు పైగా కామెంట్లు చేశారంటే పోస్ట్ ఏవిధంగా వైరల్ అయ్యిందో ఇట్లే అర్థమవుతోంది.

అయినా కానీ నిజంగా వేలకు వేలు పోసి కొన్న ఫోన్ కు చార్జర్ ఇవ్వకపోవడంపై సర్వత్ర ఆపిల్ సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube