అచ్చం పెయింటింగ్‌ను పోలి ఉన్న టీవీని చూశారా?

అవును! అచ్చం వాల్‌ పెయింటింగ్‌ను పోలి ఉన్న టీవీని మీరు ఎప్పుడైనా చూశారా? దీన్ని ప్రముఖ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ ఈ కొత్త రకం టీవీని పరిచయం చేసింది.దాని పేరు శాంసంగ్‌ ది ఫ్రేమ్‌ టీవీ 2021 సిరీస్‌.

 Samsung Released New Frame Like Tv-TeluguStop.com

ఇది 43 అంగుళాల నుంచి 65 వరకు వివిధ సైజుల్లో అందుబాటులో ఉంది.ఈ టీవీ మన దేశంలో కూడా రిలీజ్‌ చేశారు.

టీవీ అంచుల డిజైన్ ను వేర్వేరు రకాలుగా మార్చుకోవచ్చు.ఇందులో 1400 వరకు ఆర్ట్‌ పీస్‌లు ఉన్న ప్రీలోడెడ్‌ లైబ్రరీ ఉంది.

 Samsung Released New Frame Like Tv-అచ్చం పెయింటింగ్‌ను పోలి ఉన్న టీవీని చూశారా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంటే టీవీని ఉపయోగించకుండా ఉంచినప్పుడు దాన్ని ఒక పెయింటింగ్‌లా పెట్టుకోవచ్చన్న మాట.గతంలో వచ్చిన మోడల్‌ కంటే ఇది 46 శాతం సన్నగా ఉంది.దీన్ని చూడగానే పిక్చర్‌ ఫ్రేమ్‌లా అనిపిస్తుంది.

ఇది మనదేశంలో రూ.61,990 నుంచి ప్రారంభం కానుంది.43 , 50, 55, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉండనుంది.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్‌ ఆన్ లైన్‌ స్టోర్లలో జూన్‌ 12వ తేదీ నుంచి వీటి సేల్‌ ప్రారంభం కానుంది.జూన్‌ 12వ తేదీ – 21వ తేదీలోపు ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.9,990 విలువైన బెజెల్‌ను ఉచితంగా అందించనున్నారు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్‌ బ్యాక్‌ లభించనుంది.24 నెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ టీవీ కొనుగోలు చేయడానికి కేవలం నెలకు రూ.2,000లోపే చెల్లించి ఈ టీవీని కొనుక్కోవచ్చు.

Telugu Dot Colour Technology, Emi Options, Flipkart, Free Loded Library, Painting Wall, Samsung, Samsung The Prime Tv 2021, Starts From June 12 Th-Latest News - Telugu

ఈ టీవీలో క్వాంటం డాట్‌ కలర్‌ టెక్నాలజీ ద్వారా 100 శాతం కలర్‌ వాల్యూమ్‌ను ఇందులో అందించారు.క్వాంటం ప్రాసెసర్‌ 4కేపై ఈ టీవీ పనిచేయనుంది.ఈ టీవీకి వాల్‌ మౌంట్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పెయింటింగ్‌ మాదిరి కనిపించేలా స్టాండ్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందించనుంది.ఈ టీవీలో ఆర్ట్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేయడం ద్వారా ఆన్ లో లేనప్పుడు ఈ టీవీని పెయింటింగ్‌లా ఉపయోగించుకోవచ్చు.

స్క్రీన్‌ మీద ఏ ఆర్ట్‌ ఫాం కనిపించాలో కూడా సెలక్ట్‌ చేసుకోవచ్చు.ఇందులో 1200 ఫొటోలతో పాటు 6 జీబీ స్పేస్‌ను కూడా శాంసంగ్‌ కేటాయించింది.దీంతోపాటు మరిన్ని ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది శాంసంగ్‌.

#Emi Options #Painting Wall #DotColour #Flipkart #Samsung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు