శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్( Samsung Galaxy M15 5G smartphone ) ముందస్తు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ భారత మార్కెట్ లో విడుదల కానుంది.

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.4GB RAM+128GB స్టోరేజ్( 4GB RAM+128GB Storage ) వేరియంట్ ధర రూ.13499 గా ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.అయితే రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకుంటే.రూ.1699 విలువైన అప్పు 25W చార్జర్ రూ.299 కే కొనుగోలు చేయవచ్చు.అంతేకాదు HDFC క్రెడిట్ కార్డు ద్వారా బుకింగ్ చేసుకుంటే ఏకంగా మూడు నెలల పాటు కస్టమర్లు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే( AMOLED display ) తో వస్తోంది.వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో ఉంటుంది.ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాలతో ఉంటుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ కెమెరాతో నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఏకంగా నాలుగు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్డేట్ లను పొందవచ్చు.అంతేకాదు ఐదు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్ లను పొందవచ్చు.

Advertisement

ఇక ఈ ఫోన్ కు సంబంధించిన మిగతా ఫీచర్ల వివరాలు లాంచింగ్ సమయంలో వెలువడనున్నాయి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు