సంపూ నువ్వు గ్రేట్‌.. బాబులు అంతా నేర్చుకోండయ్యా!  

  • ‘హృదయకాలేయం’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంపూర్నేష్‌బాబు ఆ తర్వాత పు చిత్రాల్లో కమెడియన్‌గా నటించడంతో పాటు, హీరోగా కూడా సినిమాలు చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈసమయంలోనే సంపూర్నేష్‌బాబు చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో ఏపీలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తిత్లీ తుఫాన్‌కు అతలా కుతలం అవుతున్న విషయం తెల్సిందే.

  • Sampurnesh Babu Donates 50k About Titli Toofan-

    Sampurnesh Babu Donates 50k About Titli Toofan

  • తిత్లీ తుఫాన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు తన అభిమానులకు మరియు సన్నిహితులకు పిలుపునిచ్చాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుని, వారికి సాయం చేయాలని కోరాడు. దాంతో పాటు తనవంతు సాయంగా 50 వేల రూపాయలను విరాళంగా సంపూర్నేష్‌బాబు ప్రకటించాడు. ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు ఆ 50 వేలు ఇస్తున్నట్లుగా సంపూర్నేష్‌బాబు ప్రకటించాడు.

  • సంపూ తిత్లీపై స్పందించిన తీరుకు ఆయన అభిమానులు మరియు ఇతర నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. సినిమా పరిశ్రమలో అందరి కంటే ముందుగానే తుఫాన్‌పై స్పందించి, తన సాయంను కూడా అప్పుడే అందించిన సంపూర్నేష్‌బాబు గ్రేట్‌ అంటూ ఎక్కువ శాతం మంది పోస్ట్‌ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం నీ వెదవ బిల్డప్‌ లు ఆపురా బాబు, నీవు ఇచ్చే సాయం ఏ మూలకు సరిపోతుందిరా, నీ అభిమానులు ఎవరున్నారని, వారిని సాయం చేయాలని పిలుపునిస్తున్నావురా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

  • Sampurnesh Babu Donates 50k About Titli Toofan-
  • ఎవరేం అనుకున్నా కూడా సంపూర్నేష్‌ బాబు మంచి మనసుతో ముందుకు వచ్చి తనకు తోచిన సాయంను ప్రకటించడం అభినందనీయం, ఆయనను చూసి టాలీవుడ్‌కు చెందిన ఇతర బాబులు కూడా నేర్చుకోవాలని ఆయన సన్నిహితులు మరియు ప్యాన్స్‌ అంటున్నారు.