గోల్డ్ మ్యాన్ గా సందడి చేయబోతున్న సంపూర్ణేష్ బాబు

టాలీవుడ్ లో సెటైరికల్ సినిమాలతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్నేష్ బాబు.మొదటి సినిమా హృదయ కాలేయం సినిమా చూస్తే సంపూ ఏంటో అందరికి తెలిసిపోతుంది.

 Sampoornesh Babu New Movie Gold Man, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

హీరో అంటే ఇలాగే ఉండాలి.ఇలాంటి కథలే చేయాలి అని లిమిటేషన్స్ పెట్టుకున్న టాలీవుడ్ కి సంపూర్నేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో కొత్త బాష్యం చెప్పాడు.

ఆడియన్స్ ని మెప్పించడానికి ఎలాంటి కథలు చేసిన, ఎలాంటి ఆహార్యం ఉన్న పరవాలేదని నిరూపించుకున్నాడు.ఒక్క సినిమాతోనే స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.

ఆ సినిమా తర్వాత సంపూర్నేష్ బాబు కమెడియన్ గా కూడా ఫుల్ బిజీ అయ్యాడు.తరువాత బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసాడు.

అయితే అక్కడ ఉండలేక మధ్యలోనే వచ్చేశాడు.ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరో హిట్ కొట్టాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు చాలా మంది దర్శకులు సెటైరికల్ కథలు సిద్ధం చేసుకొని సంపూర్నేష్ బాబుతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే సంపూ సినిమా ఒకటి సెట్స్ పైన ఉంది.

ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అంటూ మరో సినిమా స్టార్ట్ చేశాడు.సొసైటీలో చాలా మంది ఒంటి నిండా బంగారం వేసుకొని గోల్డ్ మ్యాన్ అవతారంలో తిరుగుతారు.

ఓ స్వామీజీ కూడా ఒంటినిండా బంగారంతో ఉంటారు.అలాంటి ఫేమస్ గోల్డ్ మ్యాన్ ల గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఒక లిస్టే వస్తుంది.

ఇప్పుడు అలాంటి వారిని స్పూర్తిగా తీసుకొని గోల్డ్ మ్యాన్ అనే సినిమా సంపూర్నేష్ బాబు చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ని సంపూ తన ట్విట్టర్ ద్వారా దసరా సందర్భంగా రిలీజ్ చేశాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube