ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన బర్నింగ్ స్టార్

హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కామెడీ హీరో సంపూర్నేష్ బాబు.ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సంపూర్నేష్ తరువాత కూడా తనదైన స్టైల్ లో కామెడీతో సినిమాలు చేస్తూ నవ్విస్తూ వస్తున్నాడు.

 Sampoornesh Babu Back To Back Three Movies-TeluguStop.com

టాలీవుడ్ లో సెటైరికల్ కామెడీకి సంపూర్నేష్ బాబు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.అతని సినిమాలు అన్ని కూడా కాస్తా అతిగానే ఉంటాయి.

అయితే అందులో కావాల్సినంత వినోదం ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొని సడెన్ గా బయటకి వచ్చేయడంతో సంపూకి కొంత బ్యాడ్ ఇమేజ్ వచ్చింది.

 Sampoornesh Babu Back To Back Three Movies-ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన బర్నింగ్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నాడు.అప్పుడప్పుడు క్యామియో రోల్స్ లో మెరిస్తూ వచ్చాడు.

తరువాత కొబ్బరిమట్ట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఆ సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయం చేసి అందరిని నవ్వించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సంపూర్నేష్ బాబు హీరోగా బజారు రౌడీ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.తాజాగా అతని పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా మూడు సినిమాలని ఎనౌన్స్ చేశారు.

పుడింగి నెంబర్ 1, క్యాలీ ఫ్లవర్ టైటిల్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు.ఇక క్యాలీ ఫ్లవర్ సినిమాలో భారతీయ స్త్రీలని ఉద్ధరించడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన బ్రిటిష్ దొరగా కనిపించబోతున్నాడు.

పుడింగి నెంబర్ వన్ సినిమాలో సంపూర్నేష్ బాబుకి జోడీగా లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న విద్యుల్లేఖ రామన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటం విశేషం.మొత్తానికి ఈ ఏడాది బర్నింగ్ స్టార్ మూడు సినిమాలని లైన్ లో పెట్టి హీరోగా మరింత స్పీడ్ పెంచే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

#Pudingi No 1 #South Heroes #Burning Star #Three Movies #Cauliflower

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు