ఖాళీ సమయాల్లో ఆ వీడియోలు చూస్తాను.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్ వైరల్!

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని కామెడీ హీరోగా సంపూర్ణేష్ బాబు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన బజారు రౌడీ సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

 Sampoornesh Babu Abotu  Garikapati  Chaganti Speeches ,  Sampoornesh Babu ,  Abo-TeluguStop.com

సంపూర్ణేష్ బాబు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనడంతో పాటు ఆ షో నుంచి కొన్ని రీజన్స్ వల్ల మధ్యలోనే వెళ్లిపోయారు.

ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు మిడిల్ రేంజ్ హీరోలు, పెద్ద హీరోల సినిమాల్లో సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా సంపూర్ణేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి, ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చారు.

పిల్లలు ఫోన్లకు అడిక్ట్ కావడం వల్ల వాళ్ల మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతోందని సంపూర్ణేష్ బాబు కామెంట్లు చేశారు.

Telugu Chagati, Garikapati, Tollywood-Movie

సమాజంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ప్రేమానురాగాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని సంపూర్ణేష్ బాబు వెల్లడించారు.ఎదగాలంటే కలలు కనాలని కలలు కంటే మాత్రమే లక్ష్యాలను సాధించుకోవడం సాధ్యమవుతుందని సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు.తాను చిరంజీవి ఫ్యాన్అని ఆయన డ్యాన్స్ లో గ్రేస్ గొప్పగా ఉంటుందని సంపూర్ణేష్ బాబు వెల్లడించారు.

Telugu Chagati, Garikapati, Tollywood-Movie

తన జీవన విధానం గురించి మాట్లాడుతూ తాను ఖాళీగా ఉన్న సమయంలో చాగంటి, గరికపాటి వీడియోలను చూస్తూ ప్రవచనాలను వింటానని సంపూర్ణేష్ బాబు అన్నారు.ప్రవచనాలు వెంటనే అర్థం కావని కొన్నిరోజులు వింటే మాత్రమే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని సంపూర్ణేష్ బాబు వెల్లడించారు.ఆ వీడియోల వల్ల సాత్విక భావం కలుగుతుందని ఏమీ సాధించకపోయినా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube