నాలుగేళ్లుగా ఊరిస్తున్న సంపూర్నేష్‌బాబు ఎట్టకేలకు రాబోతున్నాడు.... కడుపులు పట్టుకుని సిద్దంగా ఉండండి

తెలుగు హీరోలకు తమిళ హీరోలకు చాలా తేడా ఉంటుంది.తెలుగు హీరోలు అందంగా ఉంటేనే ప్రేక్షకులు ఆధరిస్తారు.

 Sampoornash Babu Kobbari Matta Movie Coming Soon 1-TeluguStop.com

కాని తమిళ హీరోలు డీ గ్లామర్‌గా ఉన్నా సక్సెస్‌ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి.అయితే డీ గ్లామర్‌గా ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారంటూ సంపూర్నేష్‌బాబు నిరూపించాడు.

హృదయ కాలేయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్నేష్‌బాబు ఆ తర్వాత సింగం చిత్రంలో కూడా హీరోగా చేసి నవ్వించాడు.ఇక సంపూర్నేష్‌బాబు ‘కొబ్బరి మట్ట’ చిత్రం గత నాలుగు సంవత్సరాలుగా ఊరిస్తూనే ఉంది.

నాలుగేళ్లుగా ఊరిస్తున్న సంపూ

‘హృదయ కాలేయం’ చిత్రం మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.సంపూర్నేష్‌బాబు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.పెద రాయుడుకు పేరడీ అన్నట్లుగా ఈ చిత్రం ఉంటుందని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో సంపూర్నేష్‌బాబు ఒక పాట కూడా పాడటం జరిగింది.

ఈ చిత్రం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు జులై 19వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

నాలుగేళ్లుగా ఊరిస్తున్న సంపూ

గతంలో కూడా సినిమా విడుదల కాబోతుంది అంటూ ప్రకటించి వెనక్కు తగ్గారు.అయితే ఈసారి మాత్రం డేటు ప్రకటించడంతో అందరు కూడా ఈసారి కొబ్బరి మట్ట రావడం పక్కా అంటున్నారు.కొబ్బరి మట్ట చిత్రంలోని సంపూ గెటప్స్‌ ఇప్పటికే తెగ నవ్విస్తున్నాయి.

ఇక సినిమాలో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాడేమో అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రం విడుదలైతే మళ్లీ సంపై టైం స్టార్‌ అవుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

మరి ఆయన ఏ స్థాయిలో ఈ చిత్రంతో ఆకట్టుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube