పుడింగి నెంబర్ 1' గా సంపూర్ణేష్ బాబు!

తెలుగు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు.హృదయ కాలేయం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.

 Sampoo Pudingi No 1 Movie Launched-TeluguStop.com

ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించగా కొబ్బరి మట్ట సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త సినిమాతో ముందుకు రానున్నాడు సంపూర్ణేష్ బాబు.

కొత్త డైరెక్టర్ మీరావళి దర్శకత్వంలో పుడింగి నెంబర్ 1అనే టైటిల్ తో హీరోగా నటిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను కన్ఫామ్ చేయగా ఈ సినిమాలో విద్యుల్లేఖరామన్, సాఫీ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 Sampoo Pudingi No 1 Movie Launched-పుడింగి నెంబర్ 1′ గా సంపూర్ణేష్ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా ఏప్రిల్ 6 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుపగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ సినిమాకు క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.

Telugu Meravali, Pudingi No 1, Sampurnesh Babu, Tollywood-Movie

ఇక ఈ సినిమా గురించి సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ డైరెక్టర్ మీరావళి తో తను టూ ఇయర్స్ గా ట్రావెల్ అవుతున్నానని తెలిపాడు.ఇక ఆ డైరెక్టర్ లో మంచి కసి ఉందని, తనలాంటి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కె.ఎస్.రామారావు కు, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు కి ధన్యవాదాలు తెలిపాడు.ఇక హీరోయిన్ సాఫీకౌర్ మాట్లాడుతూ తెలుగులో తను ఈ సినిమాతో తొలిసారిగా నటించనునని తెలిపింది.ఇక సంపూర్ణేష్ బాబు తో తను సినిమా చేయనుందని తెలిసాక తన ఫ్రెండ్స్ చాలా మంది తనకు కాల్ చేశారని, వాళ్లంతా హృదయ కాలేయం సినిమా చూశారని తెలిపింది.

అంతేకాకుండా సంపూర్ణేష్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతుంటాయని, ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

#Meravali #Sampurnesh Babu #Pudingi No 1

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు