పవన్‌, దాసరిల మూవీ దర్శకుడు ఈయనే!!  

Sampath Nandi To Direct Dasari-pawan Movie -

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, శరత్‌ మారార్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత పవన్‌ కళ్యాణ్‌ తన తర్వాత సినిమాను దాసరి నారాయణ రావు నిర్మాణంలో చేయబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే దాసరి నారాయణ రావు పలు కథలను పవన్‌ కోసం విన్నాడు.

Sampath Nandi To Direct Dasari-Pawan Movie-Latest News English-Telugu Tollywood Photo Image

కొన్ని కథలను పక్కకు ఉంచినట్లుగా తెలుస్తోంది.‘సర్దార్‌’ పూర్తి అయిన వెంటనే పవన్‌తో దాసరి చర్చలు జరిపే అవకాశాలున్నాయి.

దాసరి నిర్మించబోతున్న ఆ మూవీకి దర్శకత్వం ఎవరు వహిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి క్రమంలో పలువురు పేర్లు ప్రస్థావనకు వచ్చాయి.

వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంపత్‌ నంది.ఇటీవలే ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపత్‌ నంది యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమా తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా ఈయన చెప్పుకొచ్చాడు.తాజాగా ఈయన దాసరిని కలవడం జరిగిందని, పవన్‌ కోసం తాను రెడీ చేసుకున్న ఒక స్క్రిప్ట్‌ను సైతం దాసరికి వినిపించడం జరిగిందని తెలుస్తోంది.

దాంతో పవన్‌, దాసరిల సినిమాకు సంపత్‌ దర్శకత్వం వహిస్తాడేమో అనే టాక్‌ వినిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sampath Nandi To Direct Dasari-pawan Movie- Related....