ఊర్వశి రౌటేలని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్న దర్శకుడు

బాలీవుడ్ హాట్ బాంబ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని ఐటెం సాంగ్స్ కి, బోల్డ్ కంటెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన భామ ఊర్వశి రౌటేల.పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ లతో ఈ అమ్మడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది.

 Sampath Nandi Plan Female Centric Movie With Urvashi Rautela, Citymaar Movie, To-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ వారికి కావాల్సిన ఫోటోలతో సందడి చేస్తుంది.కేవలం గ్లామర్ హాట్ క్వీన్ గానే కాకుండా ఊర్వశి తన సోషల్ సర్వీస్ యాక్టివిటీతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

లాక్ డౌన్ సమయంలో కరోనాపై పోరాటానికి ఈ అమ్మడు ఏకంగా 5 కోట్లు విరాళం ఇచ్చి స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేని గొప్ప పని చేసింది.ఈ సాయంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో ఈ భామ సౌత్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఈ నేపధ్యంలో సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీమార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం ఊర్వశిని ఎంపిక చేశారు.

ఈ సాంగ్ కోసం అమ్మడుకి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఊర్వశితో ఓ ఫిమేల్ సెంట్రిక్ బోల్డ్ కంటెంట్ మూవీని సంపత్ నంది ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ ఫిమేల్ సెంట్రిక్ కథని సంపత్ సిద్ధం చేశారని సమాచారం.తన ప్రొడక్షన్ లో ఈ సినిమాని వేరొకరి దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం.

త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.మరి ఇది ఎంత వరకు వాస్తవరూపం దాల్చుతుంది అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube