సీటీమార్ సినిమా కోసం మరికొంత టైం... క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాలని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.షూటింగ్ లు షురూ చేశారు.

 Sampath Nandi Gives Clarity About Seetimaar Shooting, Tollywood, Lockdown Effect-TeluguStop.com

ఇక ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన నటులు కూడా చాలా ఉత్సాహంగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.దీంతో మరల కొంత వరకు కృష్ణ నగర్ లో కష్టాలు పడుతున్న టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్ లకి పని దొరికింది.

కేవలం సినిమా మాత్రమే కాకుండా అన్ని రంగాలు మెల్లగా గాడిలో పడుతున్నాయి.తిరిగి తమ పనులు ప్రారంభిస్తున్నారు.

ఇక పల్లెవాసానికి తరలి వచ్చిన జనం మరల పట్టణాల వైపు పరుగులు తీసేందుకు సిద్ధం అవుతున్నారు.తక్కువ క్యాస్టింగ్ తో తెరకెక్కే సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయిపోయిన కొన్ని సినిమాలకి ఎక్కువ మంది నటులు, టెక్నీషియన్స్ అవసరం పడుతుంది.

ఇలా ఎక్కువ మంది అవసరం పడే సినిమాలు ప్రభుత్వం పూర్తి స్థాయి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ సినిమా గురించి దర్శకుడు సంపత్ నంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సీటీమార్ స్పోర్ట్స్, యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమా.ఈ సినిమాకు కబడ్డీ నేపథ్యం కావడంతో ప్రొఫెషనల్స్ అవసరం ఉంది.పైగా యూనిట్ మెంబర్స్ కూడా ఎక్కువగా కావాలి.ప్రస్తుత సమయంలో షూటింగ్ కు వెళ్తే వారందరి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.

ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం.అతి త్వరలో షూటింగ్ ప్రారంభించాలని నేను, నిర్మాత, హీరో ఎదురుచూస్తున్నాం.

గోపీచంద్ అభిమానులు, ప్రేక్షకులు మాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.

స్టే సేఫ్ అని పోస్ట్ పెట్టారు.సంపత్ నంది చెబుతున్న ప్రకారం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి సిటీమార్ స్టార్ట్ అవ్వాలంటే మరో రెండు నెలలైనా పట్టె అవకాశం ఉందని ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube