సమోసాలు అమ్మే కుర్రాడి దెబ్బకి ఆ సాఫ్ట్ వెర్ ఉద్యోగి షాక్.! లోకల్ ట్రైన్ లో ఏం మాట్లాడుకున్నారంటే.?

చదువు రాని వాడు దేనికీ పనికిరాడంటూ లెక్క కడుతున్న సమాజానికి, ఉద్యోగం అంటే సాఫ్ట్ వేర్ ఫీల్డ్ ఒక్కటే అనుకున్న కుర్రకారుకు, చదువురాకుంటే సంకనాకి పోతావ్ అంటూ శాపనార్థాలు పెట్టే తల్లీదండ్రులకు… మార్క్ ల చుట్టూ, డిగ్రీల పట్టాల చుట్టూ నడుస్తున్న నేటి చదువుకు అన్నింటికి సరైన సమాధానం…ఈ సాప్ట్ వేర్ ఉద్యోగి, సమోసాలమ్ముకునే వ్యక్తి మద్య సంభాషణ.ఓ సారి విని చూడండి అక్షరాల నిజమని మీరే, మీ నోటితో అంటారు.

 Samosa Seller Counter To Software Employee-TeluguStop.com

అలాగని….చదువు పనికిరాదని మా ఉద్దేశ్యం కాదు.

డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదే మా సందేశం!
ఆరోజు ఎప్పటిలా నేను నా office works ముగించుకుని లోకల్ ట్రైన్ లో బయలు దేరాను.నాముందు ఒక పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు.

“నేను ఏం తమ్ముడూ!! పూర్తిగా అమ్మేసావా సమోసాలు ”.
“అవును సార్!”
“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?
“అవును సార్!! ఏంచేస్తాం.పొట్ట కోసం తప్పదు కదా!!”
ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది???
“ముప్పావలా వస్తుంది సార్!!”
“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”
“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.సరాసరి ఒక రోజుకు 2,000 ఖచ్చితంగా అమ్ముతాను సార్!!”
నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 అంటే 1,500రూ.

నెలకు 45,000రూ.ఓరి దేవుడో.

నా నెల జీతం 15,000రూ మాత్రమే.వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా…
“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”
“లేదన్నా మా యజమాని వేరే వారి దగ్గర కొని నాకిస్తాడు”
“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా.

పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… అక్క పెళ్ళి చేసాను… ”
ఆ పొలం విలువ ఇప్పుడు పదిహేను లక్షలుంటుంది…?????????????
నాకు మాటలు లేవు.ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.అనుకుని తమ్ముడు!! ఏం చదువుకున్నావు.
మూడో తరగతి…
ఏం నీకు చదవాలని లేదా!!!
సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.

కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… కానీ నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇక నాకు చదువు అక్కరలేదు.
అబ్బ్బ ఎంత గొప్పనీతి సూత్రం!!!
అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!
ఇప్పుడు చెప్పండి….

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు….చదువులేని వారు అనామకులూ కాదు… మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచుకుంటే… రేపు మనదే…

నోట్: ఇదేదో సమోసాలు అమ్ముకునే వాడితోనో.తోపుడు బండి నడిపేవాడితో పోల్చామని అనుకోవద్దు.మనం చేసే పని లో తప్పు లేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని క్రొత్త అవకాశాలను వెదకటంలో తప్పులేదు.దీనినే ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు.(విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళి పనిచేసే ఎందరో మిత్రుల కథలకు స్ఫూర్తిగా ఈ కథ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube