బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు.. సమంత ఒప్పుకుంటుందా?

ఈమధ్య తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో అడుగుపెడుతున్నారు.రీమేక్, డబ్బింగ్ సినిమాలతోనో మొత్తానికి బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు.

 Samntha Gets Bollywood Offers Samantha, Tollywood, Bollywood Offers, The Family-TeluguStop.com

ఇక ప్రస్తుతం మరో బ్యూటీ అక్కినేని కోడలు సమంత కూడా బాలీవుడ్ అవకాశాలను అందుకుంటుంది.పెళ్లి తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలలో నటించగా ప్రస్తుతం తెలుగులో శాకుంతలం సినిమాతోనే బిజీగా ఉంది.

ఇక సమంత ఇటీవలే రాజ్ డి.కె దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ మెన్ 2‘ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి.చెన్నై నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సిరీస్ కు సమంతను ఎంచుకున్నారు.

ఇక ఈ ట్రైలర్ విడుదల తర్వాత సమంత బాలీవుడ్ నుంచి అవకాశాలు అందుకుంటోంది.అంతే కాకుండా ది ఫ్యామిలీ మెన్ 2 దర్శకుడు రాజ్ డి.కె కూడా సమంత కోసం హిందీలో ఓ సినిమా చేయడానికి ఓకే అంటున్నారు.అంతే కాకుండా పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం చూస్తున్నారట.

Telugu Samantha, Tollywood-Movie

ఇదిలా ఉంటే సమంత నటించిన యూటర్న్ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో తెలిసిందే.ఇక ఈ సినిమాను హిందీలో రీమేక్ చెయ్యాలని.అందులో సమంతనే నటించాలని కోరగా అప్పుడు బాలీవుడ్ అవకాశాలు వదులుకుంది.ఇక కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో సమంతకు మరో అవకాశం రాగా తనకు బాలీవుడ్ సూట్ కాదని చెప్పి తప్పుకుంది.

కానీ ప్రస్తుతం సమంత కు బాలీవుడ్ అవకాశాలు వరుసగా వస్తున్నాయి.ఒకప్పుడు బాలీవుడ్ సూట్ కాదని చెప్పిన సమంత మరి ఇప్పుడైనా బాలీవుడ్ అవకాశాన్ని అందుకుంటుందో.వదులుకుంటుందో.చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube