సమ్మోహనం మూవీ రివ్యూ  

 • చిత్రం : సమ్మోహనం
  బ్యానర్ : శ్రీదేవి ఎంటర్టైన్మెంట్
  దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
  నిర్మాతలు : శివలెంక కృష్ణప్రసాద్
  సంగీతం : వివేక్ సాగర్
  విడుదల తేది : జూన్ 15, 2018
  నటీనటులు : సుధీర్ బాబు, అదితిరావు హైదరీ, నరేష్ తదితరులు

 • కథలోకి వెళితే :

 • విజయ్ (సుధీర్ బాబు) ఒక పెయింటర్‌. చిన్నపిల్లల పుస్తకాలపై ఇల్లుస్ట్రేషన్స్ వేస్తుంటాడు. ఇతనికి ఆర్ట్ మీద ఎంత ప్రేమ ఉందో, సాహిత్యం మీద ఎంతటి సదాభిప్రాయం ఉందో, సినిమాలపై పూర్తి భిన్నంగా చెడు అభిప్రాయం ఉంది. పచ్చిగా చెప్పాలంటే సినిమాలంటే పడదు. కాని అతని తండ్రి (నరేష్) కి మాత్రం సినిమాలంటే పిచ్చి. ఒక ఆర్టిస్ట్ కావాలని కలలు కనేవాడు. ఆ పిచ్చికి పరాకాష్ఠ ఓ సినిమా షూటింగ్ కోసం తన ఇంటిని అద్దెకివ్వడం. ఇక్కడే విజయ్ కి పరిచయం అవుతుంది సమీర (అదితి). తనొక స్టార్ హీరోయిన్. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి విజయ్ ని తెలుగు ట్యూటర్ గా పెడతారు. ఇలా వారి మొదలైన మాటలు ఎటువంటి మలుపులు తిరిగాయో, ఎలాంటి భావోద్వేగాలకి లోనయ్యాయో థియేటర్లలో చూడండి.

 • -

 • నటీనటుల నటన :

 • సుధీర్ బాబు పరిణీతి కలిగిన నటనని కనబర్చాడు. హాడావుడి లేకుండా, అతికి వెళ్ళకుండా, సెటిల్డ్ గా అభినయించాడు. టెర్రస్ సన్నివేశం, ఇంటర్వల్ లో సబ్టిల్ గా పెట్టిన హావాభావాలు బాగా పండాయి. అదితి రావు మరోసారి తాను ఎంత మంచి నటో చూపించింది. చాలా సహజంగా, తెలుగు వచ్చిరాని స్టార్ హీరోయిన్ పాత్రకి అతికినట్టుగా సరిపోయింది. నరేష్ పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. చాలాకాలం తరువాత సీనియర్ నరేష్ లో ఒకప్పటి నరేష్ కనిపించాడు. సపోర్టింగ్ క్యాస్ట్ మంచి సపోర్ట్ ని అందించారు‌.

 • టెక్నికల్ టీమ్ :

 • వివేక్ సాగర్ సంగీతం వినసొంపుగా ఉంది. ఓ చెలితార, ఊహలు ఊరేగే పాటలు ఇప్పటికే ప్రజాదారణ పొందాయి. నేపథ్య సంగీతాన్ని అద్భుతం అనలేము కాని, బాగుంది. పిజీ విందా సినిమాటోగ్రాఫి సినిమాకి పెద్ద అస్సెట్. ఓ చెలితార పాటని చిత్రీకరించిన విధానం నిజంగానే అద్భుతం. ఎడిటింగ్ అక్కడక్కడా సినిమా పేస్ ని నెమ్మదించేలా చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 • విశ్లేషణ :

 • చందమామ లాంటి కథల్లోనే ఒక మాములు కుర్రాడు రాకుమారితో ప్రేమలో పడతాడు‌. ఇది అలాంటి కథే. ఓ సాధారణ యువకుడు ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కథ కొత్త ప్రపంచంలో ఉండటంతో, అక్కడే చిన్నిపాటి ఆసక్తి మొదలవుతుంది. అయితే ప్రథమార్థంలో ఉన్న ఒకటి రెండు సన్నివేశాలు ల్యాగ్ లాగా అనిపిస్తాయి. కాని ఎక్కువ ఆలస్యం జరగకముందే సినిమా పుంజుకుంటుంది. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఇంద్రగంటి రచనకి బలం చేకూర్చుంది‌. మంచి ఇంటర్వల్ సన్నివేశంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొద్దిగా లెంగ్తిగా అయిపోయింది. అది మినహా, క్లాస్ ప్రేక్షకులకి మంచి సినిమా సమ్మోహనం. నరేషన్ స్లో గా ఉండటం ఒక్కటే పెద్ద కంప్లయింట్.

 • ప్లస్ పాయింట్స్ :

 • * హీరోహీరోయిన్ కెమిస్ట్రీ

 • * నరేష్ కామెడి

 • * టెర్రస్ సీన్, ఇంటర్వల్, క్లయిమాక్స్

 • * సంగీతం

 • మైనస్ పాయింట్స్ :

 • * స్లో నరేషన్

 • * హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

 • చివరగా :

 • సమ్మోహనం, ఒక మంచి సినిమా

 • రేటింగ్ : 3.25/5