'సమ్మోహనం' చిత్ర నటుడు అమిత్ హఠాన్మరణం  

Sammohanam Movie Actor Amit Purohit-

సుధీర్ బాబు,అదితి రావు హైదరి లు ప్రధాన పాత్రధారులుగా పోషించిన సమ్మోహనం చిత్రంలో నటించిన అమిత్ పురోహిత్ హఠాన్మరణం పొందినట్లు తెలుస్తుంది.ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది.అయితే ఈ చిత్రంలో అదితి మాజీ లవర్ గా నటించి అమిత్ పురోహిత్ నటించాడు...

Sammohanam Movie Actor Amit Purohit--Sammohanam Movie Actor Amit Purohit-

అయితే ఆ చిత్రంలో కలిసి పనిచేసిన హీరో సుధీర్ బాబు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేశారు.అమిత్ చాలా స్నేహాశీలి.ప్ర‌తి సీన్‌కి వంద శాతం న్యాయం చేస్తాడు.

మ‌రో యంగ్ యాక్ట‌ర్‌, మంచి న‌టుడు ఈ లోకాన్ని తొంద‌ర‌గా వీడారు.ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను అంటూ సుధీర్ ట్వీట్ చేశారు.

Sammohanam Movie Actor Amit Purohit--Sammohanam Movie Actor Amit Purohit-

అలానే ఈ చిత్ర దర్సకుడు ఇంద్రగంటి కూడా తన ట్విట్టర్ ఖాతాలో అమిత్ మృతి వార్త నన్ను దిగ్బ్రాంతి కి గురిచేసింది అంటూ ట్వీట్ చేశారు.అయితే అమిత్ హఠాన్మరణం వెనుక గల కారణాలు ఏంటి అన్న దానిపై సరైన వివరాలు వెల్లడికాలేదు.

అసలు ఏ విధంగా అమిత్ మృతి చెందారు అన్న విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.