పవన్ కళ్యాన్ పక్కన నటించాలంటే ఎవరికైనా సరే కష్టమే.. వకీల్ సాబ్ నటుడు కామెంట్స్

Sammeta Gandhi About Vakeel Saab Movie Offer

రాజన్న సినిమా ఫేమ్ సమ్మెట గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే.డ్రామాలు చేస్తూ, సీరియల్స్‌లో నటించి, అ తర్వాత వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన అద్భుత నటుడు సమ్మెట గాంధీ.

 Sammeta Gandhi About Vakeel Saab Movie Offer-TeluguStop.com

అంతే కాకుండా రాజన్న సినిమాలో ఆయన చేసిన నటనకు గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాటగిరీలో నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

వకీల్ సాబ్ సినిమాకి కూడా చాలా మందిని చూశారని తెలిసింది.

 Sammeta Gandhi About Vakeel Saab Movie Offer-పవన్ కళ్యాన్ పక్కన నటించాలంటే ఎవరికైనా సరే కష్టమే.. వకీల్ సాబ్ నటుడు కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నేను గుంటూరులో జయప్రకాశ్‌ రెడ్డి గారు పిలిపిస్తే నాటకం వేయడానికి వెళ్లానని సమ్మెట గాంధీ అన్నారు.అక్కడ మస్తానయ్య దర్గాలో ఎప్పుడూ పూజలు చేస్తానన్న ఆయన, తన భార్య పేరు కూడా ఆ దేవుని పేరు వచ్చేటట్టు మస్తానమ్మ అని పెట్టారని ఆయన వివరించారు.

అందుకే ఎప్పుడు గుంటూరు వెళ్లినా అక్కడ పూజలు చేస్తూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.అక్కడ ఉండగానే డైరెక్టర్ బాబీ గారు తనకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు అని అడిగారని, దానికి తాను గుంటూరు వచ్చానని చెప్పినట్టు ఆయన తెలిపారు.

ఎప్పుడొస్తారు అంటే, ఈ రోజు బయలుదేరి వస్తానని చెప్తే, రేపు రాగానే దిల్‌ రాజు గారిని కలవండి.మా డైరెక్టర్ కూడా చూడాలంటున్నారు అని అతను చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా పవన్ కల్యాణ్ సినిమాలో ఒక పాత్ర ఉంది అని అనగానే, దానికి సర్ పొరపాటున కూడా మిస్ కానివ్వను అని తాను అన్నట్టు సమ్మెట గాంధీ తెలిపారు.

Telugu Intresting Facts, Pawan Kalyan, Rajanna, Sammeta Gandhi, Tollywood, Vakeel Saab-Movie

ఆ తర్వాత రోజు వెళ్లగానే బాబీ గారు తీసుకెళ్లి వేణు శ్రీరామ్ గారికి పరిచయం చేశారని సమ్మెట గాంధీ తెలిపారు.అక్కడ తనని ఆయన కూర్చోబెట్టి, ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది అని చెప్పారని, దానికి తాను సర్ పొరపాటున కూడా మిస్ కానివ్వకండి అని తాను ఆయన్ని అడిగినట్టు చెప్పారు.ఎప్పటినుంచో పవన్ కల్యాణ్‌తో చేయాలని కోరిక సర్ అని వేణు శ్రీరామ్‌ని తాను బతిమిలాడినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

ఏం ప్రాబ్లమ్ లేదండి, ఆ క్యారెక్టర్ మీరే చేస్తున్నారు అని ఆయన తనకు హామీ ఇచ్చినట్టు సమ్మెట గాంధీ వివరించారు.ఆ విధంగా వకీల్ సాబ్ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడమే కాకుండా ఆయనతోపాటుగా నటించాలంటే ఎవరైనా కొద్దిగా కష్టపడాల్సిందే నని ఈ సందర్భంగా సమ్మెట గాంధీ పవన్ కళ్యాణ్ నటన గురించి తెలియజేశారు.

#Pawan Kalyan #Vakeel Saab #Rajanna #Sammeta Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube