తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన సమీరా.. ఎంత క్యూట్ గా ఉన్నాడో?

బుల్లితెర యాంకర్లలో సమీరా ఒకరనే సంగతి తెలిసిందే.పలు టీవీ సీరియళ్లలో నటించడంతో పాటు అదిరింది షోకు హోస్ట్ గా చేయడం ద్వారా సమీరా పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Sameera Son Photo Goes Viral In Social Media,latest Tollywood News-TeluguStop.com

ప్రముఖ నటి సన కోడలు అయిన సమీరా తాజాగా తన కొడుకును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు పరిచయం చేశారు.ఇన్ స్టాగ్రామ్ లో కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకుంటూ సమీరా కీలక విషయాలను పంచుకున్నారు.

తమ ఆనందాలకు కొడుకు చిరునామా అని సమీరా చెప్పుకొచ్చారు.పిల్లలంటే బాల్యం నుంచి తనకు చాలా ఇష్టమని సమీరా చెప్పుకొచ్చారు.తన కొడుకు సయ్యద్ అర్హాన్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నానని సమీరా కామెంట్లు చేశారు.తాను ఎదిగే కొద్దీ పిల్లలపై మరింత ఇష్టం పెరిగిందని సమీరా చెప్పుకొచ్చారు.

తాను తన స్నేహితుల పిల్లలను, అల్లుళ్లను, మేనకోడళ్లను ఎంతో అపురూపంగా చూసుకున్నానని సమీరా తెలిపారు.

ప్రస్తుతం కన్నబిడ్డ చేతిలో ఉండటంతో ఆ సంతోషాన్ని తాను మాటల్లో చెప్పలేకపోతున్నానని సమీరా అన్నారు.

ఈ సంతోషానికి కారణమైన దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నానని సమీరా చెప్పుకొచ్చారు.తనను, తన భర్తను తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకున్నందుకు అర్హన్ కు థ్యాంక్స్ అని సమీరా అన్నారు.

తన కొడుకుకు బెస్ట్ మదర్ గా ఉండటంతో పాటు బెస్ట్ ఫ్రెండ్ గా కూడా ఉంటానని సమీరా చెప్పుకొచ్చారు.

తెలుగులో సమీరా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీరియల్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.ప్రస్తుతం సమీరా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు.సమీరా యూట్యూబ్ ఛానల్ కు వేల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

 యూట్యూబ్ వీడియోల ద్వారా సమీరా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.  సమీరా బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube