ఈమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు టాప్ హీరోల సరసన నటించిన హీరోయిన్.!       2018-05-23   22:57:11  IST  Raghu V

హీరోయిన్ సమీరా రెడ్డి గుర్తు ఉన్నారా? సూర్య సన్ అఫ్ కృష్ణన్ లో “మేఘన” గా ఎంతో మంది కుర్రకారుల హృదయాలను దోచుకున్న నటి. ఎన్టీఆర్‌తో అశోక్‌, బాలీవుడ్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌తో రేస్‌ సినిమాలు తీసిన ఈమె, చాలా కాలానికి మళ్లీ అభిమానులకు కనిపించింది. అయితే సినిమాల్లో కాదండి.. సోషల్‌ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలతో.

-

ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె వార్తల్లో కనిపించడం చాలా అరుదుగా మారారు. తాజాగా తన కొడుకు రేపు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

-

‘నీతో ఇది నా మొదటి రోజు. రేపు నీవు మూడో ఏడాదిలోకి ప్రవేశించబోతున్నావు. నా ప్రపంచంలోకి వచ్చిన నీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో సమీరా ఈ ఫోటోలను పోస్టు చేశారు. ఈ పోస్టులకు నటి సమితా శెట్టి వావ్‌ అని కామెంట్‌ పెట్టారు. అభిమానులు సైతం ఆ క్యూట్‌ ఫోటోలకు వావ్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. 2014లో అక్షయ్‌ వార్దేను ఆమె పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. తన జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టు అప్పుడే సమీరా రెడ్డి ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సమీరా రెడ్డి, సోనాలి బింద్రే బాద్రాలో కలుసుకున్నట్టు తెలిసింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.