కత్తి మృతిపై సమీర్ కీలక వ్యాఖ్యలు.. దేవుడు మేలే చేశాడంటూ..?

బిగ్ బాస్ షోకు ముందు ప్రేక్షకులకు అంతోఇంతో సుపరిచితమైనప్పటికీ బిగ్ బాస్ షో ద్వారానే కత్తి మహేష్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.హౌస్ లో ఉన్నది కొన్ని వారాలే అయినా తన ఆటిట్యూడ్ తో కత్తి మహేష్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Actor Bigg Boss Fame Sameer Key Comments About Kathi Mahesh, Interesting Comment-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్ 1లో పాల్గొన్న సమీర్ కత్తి మహేష్ మృతి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కత్తి మహేష్ తో ఉన్న అనుబంధం గురించి సమీర్ మీడియాతో పంచుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కత్తి మహేష్ 5 వారాలు ఉన్నారని ఫ్రెండ్లీగా ఉంటారని సమీర్ తెలిపారు.వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించుకోవచ్చని కత్తి మహేష్ భావించేవారని సమీర్ అన్నారు.

కత్తి మహేష్ మృతి బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్లకు బిగ్ షాక్ అని ఆయన కోలుకుని వస్తారని భావించామని సమీర్ చెప్పుకొచ్చారు.తనకు బిగ్ బాస్ హౌస్ లోనే కత్తి మహేష్ తో పరిచయం ఏర్పడిందని సమీర్ అన్నారు.

తాను, కత్తి మహేష్ కలిసి రెండు సినిమాలు చేశామని సమీర్ వెల్లడించారు.కత్తి మహేష్ యాక్సిడెంట్ లో చనిపోవడం బాధాకరం అని సమీర్ వెల్లడించారు.చెన్నైలో చికిత్స జరుగుతుండటంతో కత్తి మహేష్ ను చూసే అవకాశం కూడా రాలేదని సమీర్ అన్నారు.బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్లకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని కత్తి మహేష్ చాలా సరదాగా మాట్లాడేవారని సమీర్ వెల్లడించడం గమనార్హం.

మనిషి సాధారణంగా ఉండే వ్యక్తి వేరని బయట ఉండే వ్యక్తి వేరని సమీర్ వెల్లడించారు.ఒక కన్ను పోగొట్టుకుని మరో కన్ను కూడా పోగొట్టుకోవడం వల్ల ప్రపంచం చీకటి అయిపోతుందని దేవుడు ఈ విధంగా చేసి ఒక విధంగా మేలు చేశాడని అనుకుంటున్నామని ఫ్యామిలీకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని సమీర్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube