ప్రవాసులు వీసా రెన్యువల్ కి వెళ్తే అంతే సంగతులు....!!

ప్రవాసులను తమ దేశం నుంచీ వెళ్ళ గొట్టేందుకు గాను కువైట్ ఇప్పటి వరకూ ఎన్నో రూల్స్ ను విధిస్తూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.కువైటైజేషన్ లో భాగంగా తమ దేశం లో ప్రవాసు లను బలవంతంగా వెళ్ళ గొడుతున్న కువైట్ రోజుకో నిబంధన తెరపైకి తెస్తూ ప్రవాసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

 Same Thing If Expatriates Go For Visa Renewal , Expatriates, Public Authority Of-TeluguStop.com

తాజాగా కువైట్ మరో సరికొత్త నిబంధన ను తెరమీదకు తీసుకువచ్చింది.అంతేకాదు అతి త్వరలో ఇది అమలు కానుందట.

ఇంతకీ ఎంటా నిబంధన అంటే.ఇకపై కువైట్ రావాలనుకునే వారు , ఏ ఉద్యోగం కోసం వస్తున్నారు , వారికి సంభందిత ఉద్యోగంలో ప్రావీణ్యత ఉందా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ఇందుకుగాను.

పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఓ టెస్ట్ కూడా నిర్వహిస్తుందని సదరు సంస్థ డైరెక్టర్ వెల్లడించారు.

ఈ పరీక్షలు కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ సహకారంతో నిర్వహిస్తారట.ఈ పరీక్షలు మొత్తం రెండు దశల్లో నిర్వహిస్తారట.మొదటి దశలో కువైట్ లో ఉద్యోగం కోసం వచ్చే వారికి టెస్ట్ లు పెట్టగా , రెండవ దశలో వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వచ్చే వారికి నిర్వహిస్తారట.ఇక ఈ టెస్ట్ లలో ఫెయిల్ అయితే పెట్టే బేడా సర్ధేసుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందేనట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube