అప్పుడు 'లెజెండ్'.. ఇప్పుడు 'అఖండ‌'..! అదే ప‌రిస్థితి!!

Same Situation About Legend And Akhanda

నందమూరి బాలకృష్ణ.మాస్ లో ఈ మాటకి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంత కాదు.

 Same Situation About Legend And Akhanda-TeluguStop.com

బాలయ్య సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు.పరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ ని పెంచుకునే స్థాయి ఉన్న అతికొద్ది హీరోలలో బాలయ్య ఒకరు.

అయితే.పవర్ ఫుల్ బాలయ్య ని స్క్రీన్ పై ఇంకా అద్భుతంగా చూపించాలంటే అది ఒక్క బోయపాటికి మాత్రమే సాధ్యం.

 Same Situation About Legend And Akhanda-అప్పుడు లెజెండ్’.. ఇప్పుడు అఖండ‌’.. అదే ప‌రిస్థితి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేశాయి.

దీంతో.

ఇప్పుడు డిశంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న అఖండ కూడా హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.

సెంటిమెంట్ పరంగా చూసుకున్నా కూడా అఖండ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన రెండో చిత్రం `లెజెండ్` సూపర్ డూపర్ హిట్.

కానీ., దానికన్నా ముందు తీసిన దమ్ము మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

యన్టీఆర్ కెరీర్ లోనే దమ్ము బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.

దమ్ము తరువాత బోయపాటి కసిగా లెజండ్ తెరకెక్కించారు.

ఇక.ఇప్పుడు కూడా వినయ విధేయరామ తరువాత కసిగా అఖండని తెరకెక్కించారు.దీంతో బాక్సాఫీస్ వద్ద అఖండ‌ సంచ‌ల‌నం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Telugu Akhanda, Akhanda Pre, Dammu, Boyapati Srinu, Legend, Nandamuri Fans, Ntr Ram Charan, Vinayavidheya-Movie

మరోవైపు అఖండ విడుదలకి ముందే నిర్మాతలకి లాభాలు తెచ్చి పెట్టింది.నైజాం, ఏపీ, సీడెడ్‌లో ఊహించిన దాని కంటే ఎక్కువే బిజినెస్ అయ్యింద‌ని, ఓవ‌ర్‌సీస్‌లోనూ అఖండ బిజినెస్ నంద‌మూరి అభిమానుల‌ను సంతోషంలో ముంచెత్తింద‌ని స‌మాచారం.వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు అఖండ చిత్రం రూ.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది.

Telugu Akhanda, Akhanda Pre, Dammu, Boyapati Srinu, Legend, Nandamuri Fans, Ntr Ram Charan, Vinayavidheya-Movie

వీటితో పాటు శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌ను కూడా క‌లుపుకుంటే అఖండ నిర్మాత‌కు లాభాల‌నే తెచ్చి పెట్టింద‌ని టాక్‌.అయితే., ఇప్పుడున్న పరిస్థితిల్లో రూ.60 కోట్ల బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం బాలయ్య.తెలుగు సినిమాకి మళ్ళీ ఊపిరి పోసినట్టే అవుతుంది.

మరి.అఖండ ఎంతటి సక్సెస్ అవుతుంది ? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Legend #Akhanda #Akhanda #Dammu #Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube