రెచ్చిపోదాం బ్రదర్ అంటున్నది కూడా వారే

ఈటీవీ సీరియల్స్ ను జనాలు ఆధరించడం చాలా కాలం క్రితమే మానేశారు.ఎంత కొత్త ప్రయాత్నాలు చేసినా కూడా ఈటీవీలో సీరియల్స్ ను జనాలు చాలా లైట్ తీసుకుంటున్నారు.

 Same Comedians In Rajeev Kanakala Rechipodam Brother-TeluguStop.com

దాంతో చేసేది లేక కొత్త మార్గంలో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు ఈటీవీ వారు కొత్త కొత్త షో లను తీసుకు వస్తూ రేటింగ్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈటీవీలో ఇప్పటికే జబర్దస్త్‌ వారంలో రెండు రోజులు వస్తుంది.

అది తెలుగు బుల్లి తెర రంగంలోనే కొత్తగా నిలిచింది.ఖచ్చితంగా మరో లెవల్‌ కామెడీని అందిస్తుంది.

 Same Comedians In Rajeev Kanakala Rechipodam Brother-రెచ్చిపోదాం బ్రదర్ అంటున్నది కూడా వారే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఢీ లో కూడా సుధీర్ మరియు ఆదిలు కామెడీతో కుమ్మేస్తున్నారు.ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఆదివారం షో ను ప్లాన్‌ చేశారు.

జబర్దస్త్‌ కమెడియన్స్ అంతా కూడా అక్కడ కనిపిస్తున్నారు.అప్పుడప్పుడు గెస్ట్‌ లు వస్తూ ఉన్నారు.

అంతకు మించి శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్తగా ఏమీ లేదు.జబర్దస్త్‌ ను కాస్త కొత్తగా చూసినట్లుగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుంది.

అందుకే తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల నాడి పట్టిన ఈటీవీ వారు ఈటీవీ ప్లస్ లో కూడా అదే కామెడీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఈటీవీ ప్లస్ ఈమద్యే కాస్త హడావుడి మొదలు పెట్టింది.

కామెడీ షో లకు పెట్టింది పేరు అన్నట్లుగా ఉన్న ఈటీవీ ప్లస్ ఇప్పుడు ఆ స్థాయిలో లేదు.దాంతో రాజీవ్‌ కనకాల జడ్జ్ గా రెచ్చి పోదాం బ్రదర్ అనే షో ను మొదలు పెట్టారు.

అక్కడ ఎవరైనా కొత్త వారు కనిపిస్తారా అంటే మొత్తం వారే అక్కడ కూడా ఉంటున్నారు.

Telugu Etv Plus, Etv Pluse, Film News, Jabardast Comedy Show, Jabardasth Comedians, Judge, Rajeev Kanakala, Rechipodam Brother, Sridevi Drama Company, Sridevi Drama Company Promo, Sudheer-Movie

జబర్దస్త్‌ నుండి మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వెళ్లిన వారే అక్కడ కనిపిస్తున్నారు.యాంకర్‌ మరియు జడ్జ్‌ మినహా మొత్తం పాత వారే కనిపిస్తున్న కారణంగా జనాల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.ముందు ముందు అయినా కూడా రెచ్చి పోదాం బ్రదర్‌ లో కొత్త వారిని చూపించాలి.

లేదంటే కొన్ని వారాలకే రెచ్చి పోదాం అనుకుంటూ కనిపించకుండా పోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#Rajeev Kanakala #SrideviDrama #Etv Pluse #Sudheer #Etv Plus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు