'జగన్' పై దాడికి 'ఎన్టీఆర్'దాడికి కి లింక్ ఏంటి..?   Same Attack Done At 1984 On Sr NTR Like YS Jagan Attack     2018-10-26   15:48:36  IST  Surya

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న జగన్ పై కత్తి దాడి ఘటన ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తోంది..ఎవరి అంచనాలు వారివి, ఎవరి విశ్లేషణలు వారివి, అయితే ఈ దాడి వెనుకాల ఉన్న కుట్రలు తెలియాలంటే సమగ్రంగా విచారణ జరగాలి, కుట్ర దారులు ఎవరనేది బహిర్ఘాతం చేయాలి. కానీ ఇప్పటి వరకూ అధికార పార్టీ ఆవైపుగా ప్రయత్నాలు మాని రకరకాలుగా జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుండటంతో చంద్రబాబు నాయుడు పై మేధావులలో సైతం విసుగు తెప్పిస్తున్నాయి.. అప్పట్లో జరిగింది కూడా ఇలాంటిదేగా అంటూ ఎన్టీఆర్ పై జరిగిన దాడి ఘటనని గుర్తు చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ లు. ఇంతకీ ఎన్టీఆర్ పై దాడికి జగపై దాడికి సంభంధం ఏమిటి ఆ దాడి ఎలా జరిగింది..ఆ సమయంలో ఏమి జరిగింది అనే వివరాలు ఒకసారి పరిశీలిస్తే.

1984 సంవత్సరంలో కూడా ఏపీలో ఎన్టీఆర్ పై ఇదే తరహాలో ఓ దాడి జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పై 22ఏళ్ల వయసున్న యువకుడు మల్లెల బాబ్జీ దాడి చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో దాడి ఘటన జరిగింది. “ఇందిరా గాంధీ జిందాబాద్” అని కేకలు వేస్తూ బాబ్జీ ఎన్టీఆర్‌పై దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో ఎన్టీఆర్ వేలికి స్వల్ప గాయమైంది.

ఆ సమయంలో ఈ సంఘటన అతిపెద్ద వివాదాస్పద ఘటన అయ్యింది..బాబ్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు…ఈ కేసులో స్వయంగా ఎన్టీఆరే కోర్టుకు హాజరయ్యారు. బాబ్జీని క్షమించాలని కోర్టును కోరారు. బాబ్జీ జైలు నుంచి 1985లో బయటికొచ్చాడు. గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్‌లో తోటమాలిగా పనిచేశాడు..ఇక్కడి వరకూ ఈ కధ బాగానే నడిచింది సీన్ కట్ చేస్తే. అప్పట్లో ఈ కధ లో భారీ ట్విస్ట్ ఏమిటంటే.

Same Attack Done At 1984 On Sr NTR Like YS Jagan Attack-

అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న సమయంలో దాదాపు రెండేళ్ళ తరువాత కొన్నాళ్లకు బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో రెండు పేజీల లేఖ దొరికింది. ఎన్టీఆర్‌పై దాడి చేస్తే 3లక్షలు ఇస్తామన్నారని కానీ 30వేలు మాత్రమే చెల్లించారని ఆ లేఖలో బాబ్జీ పేర్కొనడం గమనార్హం..అసలు బాబ్జీ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రీరాములు కమిషన్ ఆ లేఖలోని అంశాలను బయటపెట్టింది..అయితే ఇప్పుడు ఇదే తరహాలో జగన్ పై దాడి జరగడం ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కావాలని సానుభూతి కోసం చేసిందని అంటుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం ఇదంతా తెలుగుదేశం కుట్ర అంటున్నారు. వైసీపీ ఈ కేసుని విచారణ కొరకు సీబీఐ కి అప్పగించాలని ఏకంగా హైకోర్ట్ లో పిటిషన్ వేశారు చూసుంటే ఈ దాడి ఘటన చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.