సమంత యశోద ఇంకా ఎన్నాళ్ళు తీస్తారు..!

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో దర్శక ద్వయం హరి హరీష్ కలిసి డైరెక్ట్ చేస్తున్న సినిమా యశోద.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్నాళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు.అప్పుడెప్పుడో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశామని చిత్రయూనిట్ ప్రకటించింది.తీరా చూస్తే ఇప్పుడు సినిమాలో మరో సాంగ్ బ్యాలెన్స్ ఉందని అది పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు.సమంత యశోద సినిమాలో ఒక సాంగ్ మినహా అంతా పూర్తయిందని తెలుస్తుంది.ఆ సాంగ్ కూడా పూర్తి చేస్తే సినిమా రిలీజ్ కి రెడీ అంటున్నారు.

 Samantha Yashoda Shooting Not Yet Completed Details, Samantha, Samantha Updates,-TeluguStop.com

యశోద సినిమాలో సమంత తన పాత్ర వేరియేషన్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.యశోద సినిమా కోసం సమంత చాలా రిస్క్ తీసుకుంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా ని జూలై సెకండ్ హాఫ్ కల్లా పూర్తి చేసి జూలై ఎండింగ్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలని చూస్తున్నారు.ఈ సినిమాను ఆగష్టు 12న రిలీజ్ ఫిక్స్ చేసారు.

ఈ సినిమాతో పాటుగా సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది.ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Telugu Samantha, Samantha Ups, Shakuntalam, Tollywood, Yashoda-Movie

అయితే శాకుంతలం సినిమా విషయంలో అప్డేట్స్ సరిగా రావట్లేదని సమంత ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.ఇదే కాదు బాలీవుడ్ లో కూడా సమంత వరుస క్రేజీ ప్రాకెట్ లు చేస్తుంది.అక్కడ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా అమ్మడు సందడి చేయనుంది.ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమాల మీద ఫోకస్ పెట్టిన సమంత తన సత్తా చాటాలని చూస్తుంది.

 ఈ సినిమాలన్నిటితో సమంత తప్పకుండా తన ఫ్యాన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఫీమేల్ సెంట్రిక్ సినిమాల మీద దృష్టి పెడుతున్న సమంత కమర్షియల్ సినిమాలకు సై అంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube