Samantha Yashoda Movie Review: యశోద రివ్యూ: యశోదగా సమంత హిట్ కొట్టినట్టేనా?

హరి హరీష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా యశోద.స్టార్ బ్యూటీ సమంత నటించిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు.

 Samantha Yashoda Movie Review And Rating Details, Yashoda Review,samantha ,saman-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా చేశాడు.ఇక ఈ సినిమా పై పోస్టర్స్, ట్రైలర్ విడుదల చేసినప్పుడేభారీ అంచనాలు వెలువడ్డాయి.

పైగా సమంత రెండేళ్ల గ్యాప్ తో తెలుగు సినిమాల్లో కీలక పాత్రలో నటించగా ఈ సినిమా కోసం తన అభిమానులు కూడా బాగా ఎదురు చూశారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పెద్ద పెద్ద బ్యానర్లతో బాగా సందడి చేశారు.

అయితే ఈ సినిమా మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.సమంతకు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు డబ్బు మీద ఆశ చూపించి వారిని సరోగసి తల్లులుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది.దీంతో పిల్లలు పుట్టని ధనవంతుల కోసం పేద అమ్మాయిలను పిల్లల కోసం ఇబ్బంది పెడుతుంటారు.

అయితే అమ్మాయిలను సరోగసి తల్లులుగా మార్చే ల్యాబ్ నిర్వాహకులు మరో పెద్ద మాఫియా తో చేతులు కలుపుతారు.వారితోపాటు ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటారు.దీంతో సరోగసి పేరుతో అక్కడ జరుగుతున్న ఆకృత్యాలను యశోద (సమంత) కు తెలియటంతో తాను ఏం చేస్తుంది.అంతేకాకుండా ఆ మాఫియా వాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

సమంత తన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకుంది.తన ఎక్స్ప్రెషన్స్ తో, ఫైటింగ్ సీన్లలో బాగా అదరగొట్టింది.వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పాత్రతో మరింత హైలెట్గా నిలిచింది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.మణిశర్మ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.

సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.ఇక మిగతా నిర్మాణ విలువలు బాగానే పనిచేశాయి.

ఎడిటింగ్ లో మాత్రం కాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

విశ్లేషణ:

ఇక సినిమా ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు బాగా నెమ్మదిగా అనిపించక వెంటనే కథ బాగా ఇంట్రెస్టింగ్ తో స్పీడ్ గా చూపించాడు డైరెక్టర్.ఇక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కు కాస్త తేడా ఉన్నట్లు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సమంత నటన, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, కథ, కథనం.

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి.ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తగా బాగుండేది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పలేం.కానీ సమంత నటన, కథ కోసం మాత్రం కొంతవరకు ఆకట్టుకుంటుందని అర్థమవుతుంది.కొంతవరకు సమంత ఈ సినిమాతో హిట్ కొడుతుందని అర్థమవుతుంది.

రేటింగ్: 3/5

.

Samantha Yashoda Movie Review

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube