శాకుంతలం స్థానంను భర్తీ చేయబోతున్న యశోద.. సామ్‌ ఫ్యాన్స్ హ్యాపీ

సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించి వెంటనే సినిమాను నవంబర్ లో విడుదల చేయలేం అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.నవంబర్ లో సమంత సినిమా వస్తుందని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు ఉసూరుమంటున్నారు.

 Samantha Yashoda Movie Release Date ,samantha,yashoda,shakunthalam,gunasekhar,ya-TeluguStop.com

మళ్ళీ సమంత సినిమా ఎప్పుడు వస్తుందో అంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఆమె నటించిన మరో సినిమా యశోద ని నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆగస్టులోనే యశోద సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

అప్పుడు వాయిదా వేసిన సినిమా ను నవంబర్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట, అందుకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Telugu Gunasekhar, Samantha, Shakunthalam, Telugu, Yashoda-Movie

హిందీ లో ఇప్పటికే యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.హిందీ తో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం లో కూడా సమంత నటించిన యశోద సినిమా ను విడుదల చేయాలని డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.అక్టోబర్ 2వ లేదా మూడో వారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని.

అందుకే నవంబర్ లో సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.మొత్తానికి శాకుంతలం మిస్ అయిన కూడా నవంబర్ లో యశోద రాబోతున్న నేపథ్యం లో అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.

హిందీ లో కూడా సమంత ఒక సినిమా చేస్తోంది, ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.యశోద సినిమా లో తమిళ స్టార్‌ హీరోయిన్ వరలక్ష్మి కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube