'మజిలీ' కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూడండి  

Samantha Working Hard For Majili Movie-

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంతలు పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రికార్డు స్థాయి బిజినెస్‌ జరిగిన ఈ చిత్రం సక్సెస్‌ కోసం సమంత తిరుమల శ్రీవారిని కాలి నడకన దర్శించుకుంది.

Samantha Working Hard For Majili Movie-

ఈ సందర్బంగా ఆమె వెంట పలువురు అభిమానులు పడ్డారు.కాలి నడక దారి మొత్తం కూడా సమంత అభిమానులు సందడి చేశాడు.

తిరుమలకు కారులో చేరుకున్న నాగచైతన్య గెస్ట్‌ హౌస్‌లో రెస్ట్‌ తీసుకోగా, సమంత మాత్రం తిరుపతి నుండి ఘాట్‌ రోడ్డు ద్వారా తిరుమల చేరుకుంది.

Samantha Working Hard For Majili Movie-

తిరుమల చేరుకున్న తర్వాత సమంత గెస్ట్‌ హౌస్‌లో రెస్ట్‌ తీసుకుని, ఆ వెంటనే మళ్లీ స్వామి వారి దర్శనంకు భర్త చైతూతో కలిసి వెళ్లింది.

సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వీరు శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో సినిమా సక్సెస్‌ కోసం వీరి పాట్లు అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు ట్రైలర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

మజిలీ చిత్రం కోసం సమంత చాలా విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతుంది.ఒక సామాన్యమైన యువతిగా సమంత కనిపించబోతుంది.రైల్వేలో ఉద్యోగి పాత్రను సమంత చేసింది.మొత్తానికి ఈ చిత్రంలో నటించే సమయంలో చాలా కష్టపడ్డ సమంత, ఆ తర్వాత కూడా చాలా కష్టపడి మరీ సినిమా సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది.శ్రీవారు మరి ‘మజిలీ’ చిత్రాన్ని సక్సెస్‌ చేస్తాడా అనేది చూడాలి.

తాజా వార్తలు

Samantha Working Hard For Majili Movie- Related....