టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
కాగా సమంత ఇటీవలె శాకుంతలం( Sakunthalam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సమంత తెలుగులో విజయ్ దేవరకొండ( vijay devarakonda ) సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.

అలాగే ఆమె బాలీవుడ్ లో వరుణ్ ధావన్( Varun Dhawan ) తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సిటాడెల్( Citadel ) అనే వెబ్ సిరీస్ కు ఇండియన్ వర్షన్ అని చెప్తూ వస్తున్నారు యూనిట్.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది.శరవేగంగా జరుగుతున్న ఈ వెబ్ సిరీస్ కి సంబందించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా సమంత ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడిన విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.ఇంతకీ సమంత ఏం మాట్లాడిందంటే? ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత కనిపించబోతోందట.

సమంత నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ప్రీక్వెల్ అని, ఇందులో సమంత ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా.సమంతనే తెలిపింది.ఆ మధ్య సమంత మీడియాతో మాట్లాడుతూ సిటాడెల్ సిరీస్ లో నాదియా సిన్హకు తల్లిగా నటిస్తున్నాను అని తెలిపింది.
హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ లో ప్రియాంక క్యారెక్టర్ పేరు నాదియా సిన్హ.అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈసిరీస్ లో ప్రియాంక చిన్నప్పటి పాత్రకు సమంత తల్లిగా నటిస్తుందట.అదుకే ఈసిరిస్.
సిటాడెల్ హాలీవుడ్ సిరీస్ కి ప్రీక్వెల్ అని చెపుతున్నారు.
