శ్రీలిల హవా ముందు తేలిపోయిన సమంత...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు…ప్రస్తుతం యువ నటి అయిన శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హిరోయిన్ గా దూసుకెళ్తోంది.2019లో వచ్చిన కిస్ సినిమా తర్వాత శ్రీలీల( Srileela ) 2021 సంవత్సరంలో భరతే అనే మరో కన్నడ మూవీ చేసింది.ఆ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.అనంతరం 2022లో మళ్లీ కన్నడలో బై టూ లవ్, జేమ్స్ చిత్రాలతో అలరించింది ఈ క్యూట్ సుందరి.

 Samantha Who Was Relieved In Front Of Srilila Hawa, Srileela , Ravi Teja, Ssmb28-TeluguStop.com

Telugu Hollywood, Philip John, Ravi Teja, Samantha, Srileela, Ssmb-Movie

2022లోనే తెలుగులో రవితేజతో( Ravi Teja ) నటించిన ధమాకా( Dhamaka ) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది స్టన్నింగ్ సుందరి శ్రీలీల.ఇందులో ఆమె నటనకు, డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దీంతో ఆమెకు అగ్ర హీరోల సరనస నటించే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.అనగనగ ఒక రాజు అనే ఓ మూవీ చేస్తుంది ఈ బ్యూటి అలాగే శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తోంది.

మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో కూడా అవకాశం కొట్టేసింది.

 Samantha Who Was Relieved In Front Of Srilila Hawa, Srileela , Ravi Teja, SSMB28-TeluguStop.com

Telugu Hollywood, Philip John, Ravi Teja, Samantha, Srileela, Ssmb-Movie

మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే 21 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఓ హాలీవుడ్( Hollywood ) మూవీలో నటించనుందని టాక్ తెగ చక్కర్లు కొడుతోంది.చెన్నై స్టోరీ అనే ఇంగ్లీష్ చిత్రంలో శ్రీలీల నటించనుందట.

అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) నటించనుందని మొదటగా టాక్ వచ్చింది.కానీ ఇప్పుడు సామ్ ను పక్కకు నెట్టేసి ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసిందని లేటెస్ట్ బజ్.మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు.ఫిలిప్ జాన్( Philip John ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా చేస్తున్నాడు.

ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి…చెన్నై యువతికి మధ్య జరిగే లవ్ స్టోరీగా మూవీ రానుందని సమాచారం…అయితే ఈ ఇయర్ మొత్తం శ్రీలీలా గారి హవానే నడుస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube