సమంత సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుంది.. ఇక్కడ మాత్రమేనా...  

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ అమ్మడు గత సంవత్సరం అక్కినేని హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సహజంగా హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారు. కాని సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో మాదిరిగా గ్లామర్‌ రోల్స్‌కు ఓకే చెప్పకుండా, కాస్త పద్దతైన రోల్స్‌ను, ప్రాముఖ్యత ఉన్న రోల్స్‌ను మాత్రమే చేస్తూ వస్తుంది.

Samantha Wants To Say Good Bye Tollywood-

Samantha Wants To Say Good Bye To Tollywood

తాజాగా సమంత యూటర్న్‌ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘యూటర్న్‌’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్‌పై సమయం నుండే అంచనాలు భారీగా పెంచారు. సినిమా విడుదల సమయంకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడం జరిగింది. యూటర్న్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను కేవలం ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. డబ్బు కోసం అన్ని పాత్రలను ఒప్పుకోను అంటూ క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Samantha Wants To Say Good Bye Tollywood-

తెలుగు సినిమా పరిశ్రమలో ఈమెతో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి లేరు. ఆకారణంగానే టాలీవుడ్‌కు ఈమె గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకుంది అంటూ సమాచారం అందుతుంది. కోలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేయాలని భావిస్తుంది. అక్కడ స్టార్‌ హీరోలతో ఈమె పలు చిత్రాలు ఇప్పటికే కమిట్‌ అయ్యింది. త్వరలోనే మరిన్ని చిత్రాలు కూడా అక్కడ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు సమంత త్వరలోనే నాగచైతన్యతో కలిసి ఒక చిత్రంతో రాబోతుంది. ఆ తర్వాత మిస్‌ గ్రానీ అనే రీమేక్‌ తో కూడా వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఆ తర్వాత తెలుగుకు గుడ్‌ బై చెబుతుందేమో అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.