మామకే ఓటేసిన అక్కినేని కోడలు

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని పెళ్లి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది.ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా డిజిటల్ డెబ్యూకు సిద్ధమైంది.

 Samantha Wanted Nagarjuna In Tfm2, Samantha, Nagarjuna, The Family Man 2, Tollyw-TeluguStop.com

బ్లాక్ బస్టర్ అయిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2జూన్ 4వ తేదీ నుండి స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సీరిస్ కోసం జనం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సీరిస్‌లో మెయిన్ లీడ్‌లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆయనతో నటించే అవకాశం రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఇండియాలో ఉన్న నటుల్లో ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ అని సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఒకవేళ మనోజ్ బాజ్‌పాయ్ కాకుండా తెలుగు హీరో ఎవరైతే బాగుంటుందని సమంతను అడగగా, కింగ్ నాగార్జున అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని సమంత తెలిపింది.దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో నిజంగా నాగ్ ఉండుంటే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

కాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత డీగ్లామర్ పాత్రలో టెర్రరిస్టుగా కనిపించనుంది.ఆమె పాత్ర ఈ వెబ్ సిరీస్‌కు కీలకంగా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇక సినిమాల పరంగా సమంత తన నెక్ట్స్ మూవీని ఎవరితో తీస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.మరి ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఆమె అభిమానులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube