తమిళ సినిమా కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న సమంత సినిమాల ఎంపికలో కూడా కథా ప్రాధాన్యత చూసుకుంటుంది.

 Samantha To Charge Less Fee For Future Movies, Tollywood, Telugu Cinema, Kollywo-TeluguStop.com

ఒకప్పటిలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు జోలికి పోకుండా కొత్తదనం ఉన్న కథలు ఎంచుకుంటుంది.ఈ నేపధ్యంలో తెలుగులో మరో లేడీ ఒరియాంటెడ్ సినిమాకి సమంత ఒకే చెప్పింది.

దీనిని సోనీ పిక్చర్స్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే పనిలో పడ్డారు.ఇదిలా ఉంటే మరో వైపు ఈ అమ్మడు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కథానాయికగా నటించడానికి ఒకే చెప్పింది.

ఇందులో మరో హీరోయిన్ గా నయనతార చేస్తుంది.

ఈ సినిమా విషయంలో సమంత ఓ నిర్ణయం తీసుకుంది.

సినిమాలో పాత్ర నచ్చడంతో తన మార్కెట్ రేటును బాగా తగ్గించుకుని సినిమా చేస్తోంది.ఈ చిత్రంలోని పాత్ర సమంతకు బాగా నచ్చేసిందట.

అయితే ఆ సినిమా బడ్జెట్టు తక్కువ కావడంతో నిర్మాతలని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా వారు ఇచ్చే మొత్తాన్ని తీసుకోవడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది.ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.

మరి తమిళంలో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా సమంతకి ఎంత వరకు ఇమేజ్ ని పెంచుతుంది అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube